ఎంపీలకు మోడీ షాక్

కరోనా కల్లోలం వేళ పార్లమెంట్ సభ్యులకు ప్రధాని మోడీ దాదాపు షాక్ ఇచ్చారు. ఎంపీల జీత భత్యాలు ఏడాది పాటు ముఫై శాతం మేరకు కోత విధించారు. సరే, ఇవ్వాళ, రేపు జీతాల మీద ఆధారపడి ఎవరు రాజకీయాలు చేస్తున్నారు? అని అనుకోవచ్చు. కానీ ఎంపీల జీతాల తక్కువేమీ కాదు.

ఇది ఇలా వుంటే, మోడీ మరో నిర్ణయం తీసుకున్నారు. ఎంపీ లాడ్స్ నిధులనే ఏకంగా క్యాన్సిల్ చేసేసారు. చిరకాలంగా ఎంపీలకు ప్రత్యేకంగా నిధులు నేరుగా అందిస్తున్నారు. వారు వాటిని ప్రభుత్వ గైడ్ లైన్స్ కు అనుగుణంగా, తమ విచక్షణ మేరకు కేటాయింపులు చేసుకోవచ్చు. 

ఈ నిధుల వినియోగం మీద కాస్త విమర్శలు కూడా వున్నాయి. ఏదైనా సమస్య వచ్చినపుడు ఎంపీలు ఈ నిధుల నుంచి విరాళం ప్రకటించి, తామేదో ఇచ్చినట్లు పబ్లిసిటీ చేస్తుంటారు. కొందరు ఎంపీలు తాము ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలకు కాకుండా వేరే చోట్లకు కూడా కేటాయింపులు చేస్తుంటారు. 

చాలా ఏళ్ల క్రితం ఏడాదికి అయిదు లక్షలతో ప్రారంభమైన ఈ నిధులు ఆ తరువాత రెండు కోట్లకు, తరువాత అయిదు కోట్లకు చేరాయి. ఇప్పుడు రెండేళ్ల పాటు ఈ ఫండ్స్ ను క్యాన్సిల్ చేసారు. అంటే ఒక్కో ఎంపీ పది కోట్ల కేటాయింపులు కోల్పోతారు అన్నమాట.

పారిశుధ్య కార్మికురాలి కాళ్ళు క‌డిగిన వైసీపీ ఎమ్మెల్యే

Show comments