తిట్టించుకోకపోతే నిద్రపట్టదా నాగబాబూ!

మల్లెమాల సంస్థపై ఓ రాయివేసి, బజర్దస్త్ నుంచి బైటకొచ్చి, "అదిరింది" అంటూ సొంత కుంపటి పెట్టుకున్న నాగబాబుకి.. వృత్తిపరంగా ఈ ఏడాది పెద్దగా కలసి రాలేదు. అదిరింది షో ఫ్లాపవడం అటుంచి.. కరోనా కష్టకాలంలో ఈటీవీ నాగబాబు ఎపిసోడ్లని బ్రహ్మాండంగా వాడుకుంటోంది. ఈ పాత ఎపిసోడ్లన్నీ చూస్తూ నాగబాబుకి నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. ఇక రాజకీయ పరంగా కూడా బాబుగారికి చీవాట్లు, ఛీత్కారాలు తప్పడం లేదు.

జనసేన పనితనం పక్కనపెడితే.. వైసీపీ చేతికి, ముఖ్యంగా అంబటి రాంబాబు అభిమానుల చేతిలో బలైపోతున్నారు మెగా బ్రదర్. కేవలం ట్వీట్లతోనే సమస్యలు పరిష్కారమవుతున్నాయని పవన్ కల్యాణ్ బిల్డప్ ఇస్తున్నారంటూ అంబటి రాంబాబు చేసిన విమర్శతో అసలు వివాదం మొదలైంది. నాగబాబు అవసరం లేకున్నా ఇక్కడ సీన్ లోకి వచ్చి చీవాట్లు తింటున్నారు. అంబటి పెట్టిన ట్వీట్ లో 'చదవటం' అనే పదాన్ని సరిగా రాయలేదట. దీన్ని హైలెట్ చేస్తూ.. నాగబాబు అంబటిని విమర్శిస్తూ ఓ ట్వీట్ వదిలారు. 'మీ ఆరోగ్యం జాగ్రత్త.. కరోనా కూతలు కూయొద్దు' అంటూ కాస్త మసాలా జోడించారు. 'ఆకాశం మీద ఉమ్ము ఊయొద్దు' అంటూ పెద్ద పెద్ద డైలాగులే కొట్టారు.

మామూలుగానే అంబటి వేళాకోళంలో దిట్ట. అందులోనూ నాగబాబు అలా గిల్లి వదిలిపెట్టాడు. ఇక చూడండి.. ఆయన్ని ఓ రేంజ్ లో తగులుకున్నారు రాంబాబు. "పవన్ కల్యాణ్ ట్విట్టర్ హ్యాండిల్" స్పెల్లింగ్ కూడా సరిగా రాయలేని నాగబాబు, ఆయన్ని ఎలా సమర్థిస్తావయ్యా అంటూ రెట్టించారు. అంతేకాదు.. నాగబాబు చేదు జ్ఞాపకాన్ని కూడా నెమరు వేశారు.

"నర్సీపట్నంలో నీ మీదే ఉమ్మేశారు కదా జనం అని అంటూనే.. సారీ అది నర్సాపుర అంటగా.. 2లక్షల ఓట్లతో అంటగా.." అని పూర్తిగా పరువు తీసేశారు. ఆ తర్వాత నాగబాబు కాస్త సైడ్ ట్రాక్ లోకి వచ్చి.. కేంద్రం నిధుల్ని వైసీపీ వాళ్లు తమ గొప్పగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. దీనికి అంబటి సవివరంగా సమాధానమిచ్చి నోరుమూయించారు.

ఈ ఎపిసోడ్ లో అటు జనసైనికులు, ఇటు వైసీపీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. ఓవరాల్ గా నాగబాబుపై వైసీపీ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. ఇలాంటి ఓవర్ యాక్షన్ చేసే.. ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి చోటా అన్నదమ్ములిద్దరూ ఓడిపోయారంటూ విమర్శించారు. మొత్తమ్మీద.. అంబటిని కదిలించి మరీ తిట్టించుకున్నారు నాగబాబు.

మనమంతా ఒక్కటే అని చాటుదాం

Show comments