రంగ్ దే శాటిలైట్ కు కరోనా బ్రేక్

భీష్మ తరువాత మరింత క్రేజ్ తెచ్చుకున్న ప్రాజెక్ట్ రంగ్ దే. అదే బ్యానర్, అదే హీరో, పైగా వెంకీ అట్లూరి డైరక్షన్. దాంతో నాన్ థియేటర్ డీల్ మంచిగానే వచ్చింది. థియేటర్ ప్లస్ శాటిలైట్ భీష్మ సినిమాకు వచ్చిన దాని కన్నా మరో కోటిన్నరకు పైగా ఆఫర్ వచ్చింది జీ టీవీ నుంచి, కేవలం శాటిలైట్ , డిజిటల్ కు కలిపి పది కోట్ల వరకు ఆఫర్ వచ్చింది.

అయితే 12 కోట్లు కావాలంటే నిర్మాత నాగవంశీ పట్టుపట్టారు. 11 కోట్ల దగ్గర బేరం తెగేలా అనిపించింది. అలాంటి టైమ్ లో బ్రేక్ పడిపోయింది. కరోనా వచ్చి అన్ని పనులు ఎక్కడివక్కడ ఆపేసింది. దాంతో రంగ్ దే శాటిలైట్ డీల్ కూడా ఆగిపోయింది. అయితే సమస్య ఏమీ లేదు. 

కరోనా వ్యవహారం ముగిసిపోతే ఫినిష్ అయిపోతుంది. థియేటర్ డీల్స్ అయితే ఎలా వుంటాయో, అప్పటి పరిస్థితిని బట్టి అని అనుకోవాలేమో కానీ శాటిలైట్, డిజిటల్ కు ఇప్పుడు మంచి డిమాండ్ నే వస్తోంది. జనాలు అందరూ ఇళ్లలో వుండి ఆన్ లైన్ ప్లాట్ ఫారమ్ లకు బాగానే అలవాటు పడిపోతున్నారు కదా?

సీతారామ కళ్యాణం

తెలుగులో అద్భుతంగా మెసేజ్ ఇచ్చిన నవనీత్ కౌర్

Show comments