ఆర్జీవీ' టైటిల్ లోగో విడుదల

సంచలన దర్శకుడు ఆర్జీవీ మీద సినిమా తీయాలన్న పంతం తో వున్నారు గేయరచయిత జొన్నవిత్తుల రామ లింగేశ్వర రావు. ఆఖరికి అది ఇప్పుడు మెటీరియలైజ్ అవుతోంది. టారస్ సినికార్ప్, మాగ్నస్ సినీప్రైమ్ పతాకంపై బాల కుటుంబరావు పొన్నూరి ఈ సినిమాను నిర్మించబోతున్నారు. 'ఆర్జీవీ' చిత్ర టైటిల్ లోగో విడుదల మరియు చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని విడుదల చేసారు. 

ఈ సందర్భంగా దర్శకులు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ 'తా చెడ్డకోతి వనమెల్లా చెరిచినట్లు' తన పిచ్చి ఇజంతో యువతను పెడత్రోవ పట్టిస్తున్న ఒక వ్యక్తి ఫిలాసోఫి మీద సంధించిన రామబాణమే ఈ సినిమా అని, అందుకే "శ్రీరామనవమి" పర్వదినాన ఈ చిత్ర టైటిల్ లోగో విడుదల చెయ్యడం జరిగిందని తెలిపారు. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిన వెంటనే చిత్రీకరణ ప్రారంభిస్తామని,  సామాజిక బాధ్యత లేని ఒక కుహనా మేధావి ఐడియాలజీ సమాజాన్ని ఎలా కలుషితం చేస్తుందో తెలిపేదే ఈ సినిమా అని చెప్పారు.

తెలుగులో అద్భుతంగా మెసేజ్ ఇచ్చిన నవనీత్ కౌర్

Show comments