ధోనీ, కొహ్లిపై యువరాజ్ సంచలన కామెంట్స్

కరోనా టైమ్ లో సెలబ్రిటీలు టాక్ ఆఫ్ ది టౌన్ గా ఉంటున్నారు. కొంతమంది సెల్ఫీ వీడియోలతో పాపులర్ అవుతుంటే మరికొంతమంది ఇంటర్వ్యూల ద్వారా జనాల నోళ్లలో నానుతున్నారు. కరోనా గురించి ఓ స్పోర్ట్స్ మేగజీన్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్, పరోక్షంగా ధోనీ, కోహ్లీల వల్ల తాను ఇబ్బంది పడ్డట్టు చెప్పాడు.

తన కెరీర్ లో అత్యుత్తమ కెప్టెన్ గా సౌరభ్ గంగూలీకి ఓటు వేస్తానన్న యువరాజ్, ఆయన జట్టులో ఆడటం తనకెప్పుడూ సంతోషంగా ఉంటుందని అన్నాడు. తనని బాగా సపోర్ట్ చేసిన వ్యక్తి కూడా గంగూలీయేనన్నాడు. అంతటితో ఆగితే బాగుండేది. ఆ తర్వాత ధోనీ-కొహ్లి ప్రస్తావన కూడా తెచ్చాడు యూవీ.

గంగూలీలాగా తనకు ధోనీ, కొహ్లి మద్దతివ్వలేదని కుండబద్దలు కొట్టాడు. గంగూలీలాగా తనకు వీరిద్దరూ సపోర్ట్ చేయలేదని మొహమాట పడకుండా చెప్పేశాడు. కరోనా క్వశ్చన్స్ తో ఇంటర్వ్యూ మొదలైనా.. ఆ తర్వాత ప్రశ్నలు కెరీర్ పైకి మళ్లడం, యువరాజ్ ఈ సంచలన కామెంట్స్ చేయడంతో ఇప్పుడివే హాట్ టాపిక్ గా మారాయి. గతంలో ఎప్పుడూ ఎలాంటి వివాదాల జోలికి వెళ్లని ఈ కాన్సర్ విజేత, ఇప్పుడు మాత్రం వివాదాస్పద స్టేట్ మెంట్స్ ఇచ్చాడు.

యువరాజ్ ఇంటర్వ్యూపై సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానుల మధ్య పెద్ద చర్చ ప్రారంభమైంది. ధోనీ, కొహ్లి పైకి కనిపించేంత సాఫ్ట్ కాదని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. అయితే బీసీసీఐ ప్రెసిడెంట్ కావడం వల్లనే గంగూలీని యువరాజ్ సింగ్ ఆకాశానికెత్తేశాడని.. ధోనీ, కొహ్లితో తనకిప్పుడు అవసరం లేకపోవడంతో వాళ్లను టార్గెట్ చేశాడని మరికొందరంటున్నారు.

అందరూ కరోనా వార్తలతో బిజీగా ఉన్న ఈ టైమ్ లో.. మాజీ ఆల్ రౌండర్ కొత్త వివాదాన్ని రగిల్చాడు. వాతావరణాన్ని మరింత హీటెక్కించాడు. ధోనీ, కొహ్లిలకు చిన్నపాటి షాకిచ్చాడు.

ప్రార్ధనలకి వెళ్లడమే మా తప్పా.. ?

వాళ్ళు పుట్టాక ఎప్పుడు ఇన్ని రోజులు వదిలి లేను

Show comments