ఆంధ్రాలో అమాంతం పెరిగిన కరోనా కేసులు

ఏపీపై కరోనా పెను ప్రభావం చూపిస్తోంది. కేవలం 12 గంటల్లో కొత్తగా 43 కరోనా కేసులు వచ్చిపడ్డాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అమాంతం 87కు ఎగబాకింది. తాజా పరిణామంతో ప్రజలు భయాందోళనకు గురవ్వడమే కాకుండా.. ప్రభుత్వం కూడా మరింత ఆలోచనలో పడింది.

నిన్న రాత్రి 9 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు మొత్తంగా 373 శాంపిల్స్ ను పరిశీలించగా.. వీటిలో 43 పాజిటివ్ గా తేలాయి. మిగతావన్నీ నెగెటివ్ వచ్చాయి. కడపలో ఒకేసారి 15 పాజిటివ్ కేసులు బయటపడడం కలకలం రేపింది. ఆ తర్వాత అత్యథికంగా 13 పాజిటివ్ కేసులు పశ్చిమ గోదావరి జిల్లాలో బయటపడ్డాయి. చిత్తూరు నుంచి 5, తూర్పుగోదావరి నుంచి 2, ప్రకాశం నుంచి 4 పాజిటివ్ కేసులు లెక్కతేలాయి.

ఢిల్లీలోని నిజాముద్దీన్ మసీదులో ప్రార్థనలకు హాజరై వచ్చిన వాళ్లలోనే ఎక్కువగా పాజిటివ్ కేసులు గుర్తించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఏపీలో ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. దాదాపు 7 వందల మంది ఢిల్లీ నుంచి ఏపీకి వచ్చినట్టు భావిస్తున్నారు. 

దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. కేవలం కేసులు పెరిగాయని మాత్రమే ప్రకటించిన ఏపీ సర్కార్.. 87 కేసుల్లో.. ఇద్దరు కోలుకున్నట్టు ప్రకటించింది. విశాఖ, నెల్లూరు ప్రాంతాలకు చెందిన పాజిటివ్ కేసులు పూర్తిగా కోలుకున్నారని తెలిపింది.

వాళ్ళు పుట్టాక ఎప్పుడు ఇన్ని రోజులు వదిలి లేను

నీ ఆస్థి ఐశ్వర్యం ఆంధ్ర ప్రజల బిక్ష అని మర్చిపోకు

Show comments