ఆర్ఆర్ఆర్ పై 'దిల్' వెనకడుగు?

కరోనా నీలి నీడలు అన్ని రంగాలపై ప్రభావం చూపిస్తున్నాయి. ఇంకా చూపిస్తాయి కూడా. ఇది జస్ట్ మొదలు మాత్రమే. వ్యాపారాలు అన్నీ కరోనా కారణంగా ప్రభావితం కావడం అన్నది మును ముందు ఎక్కువగా వుంటుంది. ఇలాంటి నేపథ్యంలో టాలీవుడ్ కూడా ఇందుకు అతీతం కాదు. 

నిర్మాత, బడా డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కొన్నాళ్ల క్రితం రాజమౌళి భారీ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ నైజాం పంపిణీ హక్కులు తీసుకున్నారు. చాలా కాంపిటీషన్ మధ్య ఆయన 75 కోట్లు ప్లస్ జిఎస్టీ తో కలిపి ఈ సినిమా హక్కులు సంపాదించారని బోగట్టా. చాలా మంది దగ్గర దాకా వెళ్లి, అంత స్టేక్ పెట్టలేక, అంత రిస్కీగేమ్ ఆడలేక వెనక్కు తగ్గిపోయారు. లాభం నష్టంతో సంబంధం లేదు, అలాంటి సినిమాను మనమే పంపిణీ చేయాలి అనే ఆలోచనలో దిల్ రాజు అంత దూరం వెళ్లారని బోగట్టా. 

అయితే ఇప్పుడు పరిస్ఢితులు మారిపోయాయి. మరో ఆరు నెలల వరకు కరోనా ఎఫెక్ట్ వుంటుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచ మార్కెట్  అంతా తీవ్రమైన ఒడిదుడుకులకు లొనవుతుందని టాలీవుడ్ జనాలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ డీల్ ను పునరాలోచించాలని దిల్ రాజు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పటికే ఓకె అయిన టెర్మ్స్ ప్రకారం అయితే చేయడం కష్టమని ఆయన భావిస్తున్నట్లు బోగట్టా.

అడ్వాన్స్ ఎంతయినా ఓకె కానీ, ఎన్నాఎ మీద చేయడం రిస్క్ అని దిల్ రాజు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ మేరకు నిర్మాత డివివి దానయ్యతో డిస్కషన్లు స్టార్ట్ కాలేదు కానీ, త్వరలో అదే జరుగుతుందని, అవసరం అయితే వేరే వాళ్లకు ఇస్తామంటే వదిలేద్దామనే ఆలోచనలో కూడా దిల్ రాజు వున్నారని తెలుస్తోంది.

వాళ్ళు పుట్టాక ఎప్పుడు ఇన్ని రోజులు వదిలి లేను

Show comments