నిర్మలమ్మ వరాలు నీటి మూటలేనా?!?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలోని ప్రజలకు ఏమైనా మేలుచేశారా లేదా? ఈ విషయంలో వందకోట్ల భారతావనిలో అత్యధికులకు అర్థం కాకుండా ఉండేలాగానే ఆమె నిర్ణయాలున్నాయి. నిర్ణయం ప్రకటించినప్పుడు జేజేలు కొట్టించుకున్న నిర్ణయాలు, కాస్త లోతుగా నిబంధనలు గమనించే సరికి గుండె గుభేలు మనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం కొత్తగా వర్తింపజేసిన వెసులుబాట్లు అన్నీ పెద్ద డ్రామా అని  అర్థమవుతోంది. 1.71 లక్షల కోట్ల ప్యాకేజీ చిట్టచివరి స్థాయిలో ఉండే పేదలకు ఎంత మేరకు చేరుతుందో గానీ.. మధ్యతరగతికి కల్పించిన వెసులుబాట్లు, ఉపశమనాలు అన్నీ డ్రామాల్లా కనిపిస్తున్నాయి.

ప్యాకేజీకి ముందు- నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్రధానమైన విషయం బ్యాంకుల రుణాల ఈఎంఐ వాయిదాలు కట్టే విషయంలో మూడు నెలల పాటు మారటోరియం ప్రకటించడం అనేది కీలకం. మూడునెలల పాటు అప్పులకు సంబంధించి డబ్బులు వసూలు చేయరు అనేది మధ్యతరగతికి పెద్ద ఉపశమనం. అసలే వ్యాపారాలు, వృత్తులు కుదేలై ఉన్నవేళ సమాజంలోని మధ్యతరగతిలో ప్రభుత్వోద్యోగ వర్గాలు తప్ప అందరూ ఆర్థిక సంక్షోభంలోనే పడ్డారు. తాజాగా అయితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోను ప్రభుత్వోద్యోగులకు కూడా సగం జీతాలే చేతికందుతున్న నేపథ్యంలో ఈ మారటోరియం మధ్యతరగతి, వేతనజీవులందరికీ వరమే.

అయితే నెమ్మదిగా ఆ మారటోరియంలోని అసలు రంగు బయటపడుతోంది. మారటోరియం అనేది  కేవలం ఒక బూటకపు ప్రకటన. రుణం తీసుకున్న ఒక సగటు వ్యక్తి.. ఒక నెలలో చెల్లింపులు చేయకపోతే ఏం జరుగుతుందో.. ఈ మూడునెలల మారటోరియం వల్ల కూడా అదే జరగబోతోంది. ఈఎంఐలో కట్ కాకపోతే గనుక.. ఆ మూడునెలల కాలానికి వడ్డీ పడుతూనే ఉంటుందని తెలుస్తోంది. క్రెడిట్ కార్డు చెల్లింపులకు కూడా ఈ మారటోరియం వర్తిస్తుంది కానీ, అక్కడ కూడా ఇదే సమస్య. క్రెడిట్ కార్డు బకాయిపై చెల్లించేదాకా వడ్డీ పడుతూనే ఉంటుంది.

వడ్డీ యథాతథంగా పడుతున్నప్పుడు.. ఇక నిర్మలా సీతారామన్ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించిన వరం ఏముంది? ఆమె వరాల వల్ల జనానికి ఏం ఒరుగుతోంది. ఇంటర్ బ్యాంక్ ఆన్ లైన్ లావాదేవీలపై చార్జీలు కూడా ఉండవని ఆమె ప్రకటించారు. కానీ ఐఎంపిఎస్ ట్రాన్స్ ఫర్లలో చార్జీలు పడుతూనే ఉన్నాయి. ఆమె చేసిన ప్రకటనలోనే డొంకతిరుగుడు బాదుడు ఉన్నదా? లేదా, కేంద్ర ఆర్థిక మంత్రి మాటలను బ్యాంకులు బేఖాతరు చేశాయా అనేది అర్థం కావడం లేదు.

నీ ఆస్థి ఐశ్వర్యం ఆంధ్ర ప్రజల బిక్ష అని మర్చిపోకు

దేవినేని ఉమని ఉతికి ఆరేసిన కొడాలి నాని

Show comments