లోకేష్ ట్వీట్ చూసావా పవన్?

ఆంధ్రలో రైతులు కరోనా కారణంగా అన్యాయం అయిపోతున్నారని, చేతికి వచ్చిన పంట పోతోందని చినబాబు లోకేష్ ఓ ట్వీటు వేసారు. లేటెస్ట్ గా ఆ ట్వీట్ లోని మ్యాటర్ ను కట్ చేసి, మీడియా ముందుకు తెచ్చారు పవన్ బాబు. ఇద్దరిది ఒకటే భావజాలం మరి. అయితే ఇక్కడ తెలియాల్సింది ఏమిటంటే, రాష్ట్రంలో రెండు, మూడు పంటలు వున్న భూములు తక్కువ. అలా రెండు, మూడు పంటలు వున్న చోట్ల ఇంకా పంట సిద్దం కాలేదు. 

కాయగూరలు, ఆకు కూరల రైతులకు సమస్య లేదు. దగ్గర లోని మార్కెట్ కు ఎప్పటి మాదిరిగానే తెచ్చుకుంటున్నారు. అలా తెచ్చుకోకుండా వుండి వుంటే, ఆంధ్రలో తినడానికి కాయగూరలు దొరికేవి కాదు. ఈ సంగతి అలా వుంచితే, హై వే మీద సరుకుల రవాణాకు అవాంతరం లేకుండా ఆంధ్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

దీనికి కావాల్సిన పాస్ కోసం ఆఫీసులకు కూడా వెళ్లనక్కరలేదు. ఆన్ లైన్ లో కేటగిరీ ఎంచుకుని, జిఎస్టీ నెంబర్ ఫీడ్ చేస్తే, అయిదుగురి వంతున పాస్ ఇస్తారు. అందువల్ల రైతుల దగ్గర నుంచి సరుకుతెచ్చుకోవడం కష్టం కాదు.

సమస్య ఎక్కడ వస్తోంది అంటే రైతు కూలీలకు, భవన నిర్మాణ కార్మికులకు పనులు లేకుండా అయింది. దీనికి ఆంధ్రదే కాదు, మరే ప్రభుత్వానిది కాదు తప్పు, కరోనా తెచ్చిన కల్లోలం. ఈ పరిస్థితి దేశం అంతా వుంది. కానీ జాతీయ పార్టీ నాయకుడైన చినబాబు ఆంధ్రలోనే ఈ సమస్య వున్నట్లు మాట్లాడతారు. ఆయన వెనుకే నడిచే పవర్ బాబు కూడా అదే ట్వూన్ అందుకుంటారు.

కానీ ఈ ఇద్దరికీ కూడా తెలంగాణలో ఏం జరుగుతోందో? ఏం సమస్యలు వున్నాయో అన్నది మాత్రం  పొరపాటున కూడా పట్టదు. అలా పట్టించుకుంటే వుంటది మరి...అని భయమేమో అన్న డౌటు. 

దేవినేని ఉమని ఉతికి ఆరేసిన కొడాలి నాని

ఇన్ని రోజులు ఒక ఎత్తు ఈ నాలుగు రోజులు ఒక ఎత్తు

Show comments