మీడియా మొగుడు కేసిఆర్

సంచలన నిర్ణయం. ప్రభుత్వ ఉద్యోగాల్లో, ఫించను దారుల్లో యాభై శాతం కోత అంటే ఇలాంటి అలాంటి సంచలనం కాదు. ఇలాంటి నిర్ణయం నెవ్వర్ బిఫోర్..ఎవ్వర్ ఆఫ్టర్ అనాలేమో? ఇలాంటి సంచలన నిర్ణయం కెసిఆర్ మాత్రమే తీసుకోగలిగారు.

ఇదే నిర్ణయం ఆంధ్ర సిఎమ్ జగన్ కనుక తీసుకుని వుంటే తెల్లవారి పత్రికలు అక్షరాలను తూటాలుగా సంధించేవి.

రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన జగన్

నిధులన్నీ రంగులకే ఖర్చు చేసి చేతులు ఎత్తేసిన జగన్

ఉద్యోగుల నోట్లో మట్టి కొట్టిన జగన్

చేతకాని జగన్

అంటూ తాటికాయలంత అక్షరాలు పత్రికల్లో కనిపించేవి.

అది చాలక ఎడిటోరియల్స్ వండి వార్చేవారు...జాతీయ మీడియాలో వచ్చిన వార్తలను తీసుకువచ్చి, ఇదిగో చూడండి జాతీయ మీడియా ఏమంటుందో అంటూ మరింత రెచ్చిపోయేవారు

పాలన చాతకాని జగన్ దిగిపోవాలని  డిమాండ్ చేసేవారు

ఆదాయం లేక జీతాలు కోత వేయడం తప్పు కాదు. ఎవరైనా అదే చేస్తారు. కానీ కేసిఆర్ చేసారు కాబట్టి సరిపోయింది. ఇదే జగన్ చేసి వుంటే..ఇంకేమన్నా వుందా?

...

కాకుంటే మరేమిటి? ఆంధ్రలో పల్లె పల్లెలో కరోనా నిబంధనులు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. కావాలంటే ఆంధ్ర పల్లెలకు వెళ్లి చూడొచ్చు. కరోనా కల్లోలాన్ని ఎదుర్కోవడానికి కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సరుకుల కొరత రాకుండా మాగ్జిమమ్ ట్రయ్ చేస్తున్నారు.

కానీ నిత్యం బాబుగారి అను'కుల' పత్రికల్లో ఏదో వంకన వెకిలి రాతలే. పల్లెల్లో వాలంటీర్ల వ్యకస్థ చాలా ఉపయోగపడింది. ముఖ్యంగా జనాలను సర్వే చేయడానికి. ఆఖరికి ఆ వ్యవస్త మీద కూడా రాళ్లేస్తున్నారు. అక్కరకు రాని చుట్టాలంటూ ఈసడిస్తున్నారు.

కానీ అదే తెలంగాణ దగ్గరకు వచ్చేసరికి మీడియా మొత్తం రాముడు మంచి బాలుడు అన్నట్లు మారిపోతోంది. కిక్కురు మనడం లేదు. 

అలా అని కేసిఆర్ అనాలని కాదు. అనే అవకాశం కూడా అక్కడ లేదు. జగన్ దగ్గరా అనే అవకాశం లేదు. కానీ ఆంధ్రలో జగన్ మీద అక్కసు వుంది. తెలంగాణలో కేసిఆర్ అంటే భయం వుంది. తొక్క తీసి వదిలిపెడతాడు అనేంత భయం వుంది.

కులపిచ్చ పట్టుకున్న ఈ పత్రికలకు ఆ భయం అలాగే వుండాలి. వీళ్లకు కేసిఆర్ లాంటి మొగుడే వుండాలి. ముకుతాడు వేసి ఆడించాలి. లేదూ అంటే, వీళ్లకు నచ్చిన వాళ్ల తప్పులు మంచం కింద దాచేస్తూ, నచ్చని వాళ్లు తప్పు చేయకున్నా బురదవేస్తూ, బ్లాక్ మెయిల్ రాతలు రాస్తూనే వుంటారు. 

Show comments