చేసిన పాపం దిద్దుకున్న చంద్రబాబు!

కరోనా అనేది ఒక మహమ్మారి. మానవాళిని అంతం చేయడానికి పుట్టినదన్నట్లుగా రోజురోజుకూ ప్రబలిపోతున్న మహమ్మారి. దీనిని అంతం చేయడానికి ప్రభుత్వాలన్నీ ఒక దృఢ సంకల్పంతో అడుగులు వేస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఔదార్యం ఉన్న వారందరూ కూడా.. తమ వంతుగా విరాళాలు అందిస్తున్నారు. ఇలాంటి విరాళాల విషయంలో తన చేతులమీదుగా జరిగిన పొరబాటును.. ఎట్టకేలకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిద్దుకున్నట్లుగా కనిపిస్తోంది.

కరోనా లాక్ డౌన్ కారణంగా.. పేదల జీవితాలు పూర్తిగా అస్తవ్యస్తం అయ్యాయి. వీరి జీవితాలకు అవసరమైన అన్నిరకాల చేయూత అందించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. అవసరమైన నిధులు కేటాయిస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు అటు ప్రధాని, ఇటు ముఖ్యమంత్రుల సహాయ నిధికి భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు.  ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా తన వంతుగా పదిలక్షల రూపాయల విరాళాన్ని ఏపీసీఎం సహాయనిధికి ప్రకటించారు.

అయితే దీనిపై పలు విమర్శలు వచ్చాయి. కేవలం ఏపీకి మాత్రమే చంద్రబాబు విరాళం ప్రకటించడం ఒక ఎత్తయితే అదికూడా కేవలం పదిలక్షలే ఇవ్వడమేంటని అంతా ఆడిపోసుకున్నారు. ఈలోగా సెలబ్రిటీలు అందరూ భారీ మొత్తలు ఇవ్వసాగారు. పవన్ కల్యాణ్ 2 కోట్లు, ప్రభాస్ 4 కోట్లు ఇలా విరాళాలు వెల్లువెత్తాయి. చంద్రబాబుకు అప్రతిష్ట తప్పలేదు. దీంతో నష్టనివారణ చర్య లాగా చేసిన పాపం దిద్దుకుంటూ.. హెరిటేజ్ ఫుడ్స్ తరఫున ఒక కోటి విరాళం నారా భువనేశ్వరి ప్రకటించారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు దక్కేది చెరి 30 లక్షలు మాత్రమే. తమిళనాడు కర్నాటక, ఢిల్లీ, మహారాష్ట్రలకు తలో పది లక్షలు దక్కుతాయి.

చంద్రబాబు తరఫున కూడా కోటి సాయం దాటిన నేపథ్యంలో.. ఇన్నాళ్లూ అధినేతకంటె ఎక్కువ తాము ఇస్తే సంకేతాలు ఎలా వెళ్తాయోనని ఆగిన తెదేపా నాయకులు.. ఇక విరాళాల విషయంలో ఉదారంగా ముందుకు రాగలరేమో. ఎంతగా దిద్దుకున్నప్పటికీ.. తాను విరాళం ప్రకటించినప్పుడు తెలంగాణ ను విస్మరించిన సంగతిని చంద్రబాబు కప్పిపుచ్చలేరు అని అంతా అనుకుంటున్నారు.

క‌రొనా పై చిరు-నాగ్ పాట చూశారా?

ఏప్రిల్ 7వ తేదీకి కేసులన్నీ ఖతం

Show comments