కారులో ఫుల్ లాగించేసిన హీరో

మందుకు అలవాటు పడితే అలాగే వుంటుంది. ఇక ఎక్కడ వున్నాం? ఎవరు వున్నారు అన్నది చూసేది వుండదు. ఓ యంగ్ హీరో కు సంబంధించి ఇలాంటి వైనం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎటువంటి బ్యాకింగ్ లేకుండా, పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో ఒకరు వున్నారు. వరుసగా హిట్ లు పడినా, ఆ తరువాత ఫ్లాపుల మీద ఫ్లాపులు ఇచ్చుకుంటూ కిందకు జారుతూ వస్తున్నారు. త్వరలో మరో సినిమా రాబోతోంది కూడా. 

సదరు హీరో సినిమా ఒకటి కొన్ని నెలల కిందట విడుదలయింది. ఈ సినిమా విడుదల సందర్భంగా హీరో విశాఖ వెళ్లారు. సింహాచలం దేవుడిని దర్శనం చేసుకున్నారు. థియేటర్ల ప్రమోషన్ కు విజయనగరం బయల్దేరారు. గట్టిగా యాభై కిలోమీటర్లు వుండదు మధ్య దూరం. కారులోనే హాఫ్ ఓడ్కా కానిచ్చేసారు.

ఆ తరువాత విజయనగరం నుంచి శ్రీకాకుళం. మరో యాభై కిలోమీటర్లు. మరో హాఫ్ ఓడ్కా ఫినిష్. ఆ తరవాత విశాఖ, గాజువాక వచ్చారు. గాజువాక థియేటర్ లో ఆల్ మోస్ట్ అవుట్. కారులో ఎలాగో ఎక్కారు. తీసుకెళ్లి హోటల్ లో చేర్చారు. 

యంగ్ ఏజ్ లో ఇంతలా అలవాటు పడిపోతే ఎలా? సినిమా అంటే టెన్షన్ వుండొచ్చు. కెరీర్ మీద టెన్షన్ వుండొచ్చు. కానీ మందు కొట్టేస్తే అవన్నీ బాగైపోవు. సరైన ప్రాజెక్టులు, సరైన టీమ్, సరైన రిలీజ్ ఇవన్నీ అవసరం. అవన్నీ గమనించి సర్దుకునేలోగానే అంతా అయిపోయేలా వుంది పరిస్థితి చూస్తుంటే.

అదంతా ప్రమోషనల్ జిమ్మిక్

క్రైమ్ జరగక ముందే ఆపడానికి వచ్చే టీం

Show comments