సీఎం జగన్, మంత్రి అనీల్ మధ్య ఏం జరుగుతోంది?

మంత్రి అనిల్ సీఎం జగన్ కు నమ్మిన బంటు. ఎమ్మెల్యేలు, మంత్రుల కంటే ముందు.. మేం జగన్ సైన్యం, జగన్ భక్తులం అంటూ.. అనిల్ కుమార్ యాదవ్ ఘనంగా చెప్పుకుంటారు కూడా. నెల్లూరు జిల్లాలో ఎంతోమంది సీనియర్లున్నా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన అనిల్ నే జగన్ ఎక్కువగా దగ్గరకు తీశారు. కీలకమైన జలవనరుల శాఖను సైతం అప్పగించారు. కర్నూలు జిల్లా ఇంచార్జి మంత్రిగా కూడా నియమించారు .

అయితే కొన్ని రోజులుగా కర్నూలు జిల్లాలో జరుగుతున్న పరిణామాలు మంత్రి అనిల్ పై జగన్ అభిప్రాయాన్ని కాస్త మార్చాయి. పోలవరం ప్రాజెక్ట్ సందర్శనలో ఈ విషయం స్పష్టంగా బైటపడింది. పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లే సమయంలో, ఏరియల్ సర్వే టైమ్ లో, చివరకు సమీక్షలో కూడా మంత్రి అనిల్ ని పూర్తిగా పక్కన పెట్టేశారు జగన్. అనిల్ వాయిస్ కూడా ఎక్కడా బైటకు రాలేదు. కనీసం సీఎం పర్యటన పూర్తయిన తర్వాత కూడా మీడియాతో సంబంధిత శాఖ మంత్రి అనిల్ మాట్లాడలేదు.

చంద్రబాబు విశాఖ పర్యటన తర్వాత చాలామంది మంత్రులు ఆయనపై ధ్వజమెత్తారు, మామూలుగా అయితే మంత్రి అనిల్ కూడా ఈ లిస్ట్ లో ఉండేవారు, కాస్త గట్టిగా మాట్లాడేవారు. కానీ కర్నూలు జిల్లాలో జరిగిన వ్యవహారం, అనిల్ పై సీఎం వద్దకు ఫిర్యాదులు వెళ్లడంతో సహజంగానే ఆయన కాస్త వెనక్కు తగ్గారు. వైసీపీ వ్యతిరేక మీడియాలో కూడా ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. దీనికి ఓ బలమైన కారణం ఉంది.

తాను ఇంచార్జి మంత్రిగా ఉన్న కర్నూలు జల్లాలోని నంది కొట్కూరు నియోజకవర్గంలో మార్కెటింగ్ కమిటీల నియామకంలో అనిల్ ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారట. నియోజకవర్గ ఇంచార్జి సిద్ధార్థ్ రెడ్డికి ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఎస్సీ ఎమ్మెల్యే అయిన ఆర్థర్ ని తక్కువ చేసి చూస్తున్నారనేది కంప్లయింట్. ఎమ్మెల్యే ఆర్థర్ అనుచరులు ఈ విషయంలో అనిల్ ని కాస్త గట్టిగానే హెచ్చరించారు. మా నియోజకవర్గంలో తిరగలేరంటూ వార్నింగ్ ఇచ్చారు.

మిగతా చోట్ల అయితే జగన్ ఇలాంటి కంప్లయింట్ ని పెద్దగా పట్టించుకునేవారు కారేమో. మహా అయితే అనుచరుల్ని అదుపులో పెట్టుకోమని ఎమ్మెల్యేకే చెప్పి ఉండేవారు. కానీ అది ఎస్సీ నియోజకవర్గం, సున్నితమైన అంశం.. అందుకే జగన్ ఈ విషయంలో కాస్త సీరియస్ గా ఉన్నారని సమాచారం. ఏమాత్రం తేడాకొట్టినా ఎస్సీలకు జగన్ వ్యతిరేకి అనే దుష్ప్రచారం జనాల్లోకి వెళ్తుంది. 

అందుకే తప్పొప్పులను పక్కనపెట్టి పార్టీ పెద్దల వద్ద అనిల్ ని కాస్త ఆవేశం తగ్గించుకోమని చెప్పారట. నేరుగా జగన్ మాట్లాడటం వేరు, పార్టీ సీనియర్ల దగ్గర ప్రస్తావించడం వేరు. అందుకే మంత్రి అనిల్ కూడా కాస్త వెనక్కు తగ్గారట. ఈ ఎడబాటు పోలవరం ప్రాజెక్ట్ రివ్యూ రోజున స్పష్టంగా కనపడింది.

క్రైమ్ జరగక ముందే ఆపడానికి వచ్చే టీం

అదంతా ప్రమోషనల్ జిమ్మిక్

Show comments