మరో బంగి అనంతయ్య దొరికాడండీ!

రాజకీయాలను శ్రద్ధగా ఫాలో అయ్యే వారికి బంగి అనంతయ్య పేరు తెలుసు. ఆయన వేషాలు కూడా తెలుసు. కర్నూలు నగరానికి మేయరుగా పనిచేసిన ఈ తెలుగుదేశం నాయకుడు.. చిత్ర విచిత్ర వేషాలతో జనాన్ని ఆకట్టుకోవడంతో తనకంటూ తెలుగు ప్రజల్లో ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. రకరకాల వేషాలు వేయడం.. ఎవరో ఒకరి మీద నిరసన వ్యక్తం చేస్తూ కర్నూలు పట్టణమంతా ఊరేగడం ఇదీ ఆయన పద్ధతి. ఇటీవలి కాలంలో ఆయన కాస్త సైలెంట్ అయ్యారు గానీ.. తెలుగుదేశం పార్టీకి మరో బంగి అనంతయ్య దొరికినట్లుగా కనిపిస్తోంది.

కడప జిల్లా రైల్వేకోడూరుకు చెందిన తెలుగుదేశం నాయకుడు పంతగాని నరసింహ ప్రసాద్ పిచ్చివాడి వేషం వేశాడు. జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల మీద బురద చల్లడమే ఎజెండగా తెలుగుదేశం అనేకానేక ప్రచారాలను సాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆ ప్రచారాలకు దన్నుగానే అన్నట్లు... ఈ చోటా నాయకుడు పిచ్చి తుగ్లక్ వేషం వేశాడు. జగన్ ను ఎద్దేవా చేయడం ఆయన లక్ష్యం అన్నమాట. తుగ్లక్ వేషంలో.. కోడూరు వీధుల్లో, బజార్లలో తిరుగుతూ దుకాణ దారులతో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ.. కాసేపు కామెడీ చేశాడు.

మరెవ్వరికీ ఆలోచన కూడా రానటువంటి ఇలాంటి పిచ్చి నిరసనల తుగ్లక్ వేషాలు తెలుగుదేశం నాయకులు మాత్రమే తడుతుంటాయి ఎందుకో మరి! నిన్నటి బంగి అనంతయ్యకు, ఇవాళ్టి పంతగాని నరసింహప్రసాద్ కు మధ్యలో.. మరో తెదేపా నేత ఎన్.శివప్రసాద్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సహజంగానే సినిమానటుడు, దర్శకుడు కూడా అయిన డాక్టర్ ఎన్.శివప్రసాద్ ఎంపీగా ఉండగా.. పార్లమెంటు ఎదుట విచిత్ర వేషధారణలతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం సేవాడు.

ప్రత్యేకహోదా డ్రామాల్లో భాగంగా మోడీకి తన నిరసనలు తెలియజేయడానికి ఆయన వేసిన వేషాలు అనేకం. అయితే ఇలాంటి వేషాల ద్వారా ఈ నాయకులకు ఒకరోజు గుర్తింపు లభిస్తుందేమో గానీ.. సమస్యలు పరిష్కారం అవుతాయా? వారు సాధించేది ఏమైనా ఉంటుందా అని ప్రజలు మాత్రం పెదవి విరుస్తున్నారు.

అదంతా ప్రమోషనల్ జిమ్మిక్

క్రైమ్ జరగక ముందే ఆపడానికి వచ్చే టీం

Show comments