'తడమ్/రెడ్' పై జాను ప్రభావం?

పక్క భాషలో హిట్ అయిన సినిమాను తెలుగులోకి తెస్తుంటే ఓ గమ్మత్తు జరుగుతూ వుంటుంది. కొందరు ఫలానా సినిమాను రీమేక్ చేస్తున్నామోచ్ అని డప్పేసి, ఆ పేరు ను, ఆ హిట్ ను క్యాష్ చేసుకోవాలని చూస్తుంటారు. మరి కొందరు రీమేక్ అన్న సంగతే దాచేసి, అదేదో తమ స్వంతంగా చేస్తున్న సినిమా అని ప్రెజెంట్ చేసే పనిలో వుంటారు. 

అందులోనూ ఎప్పడయితే తమిళ సినిమాలు హిందీలోడి డబ్ అయి యూ ట్యూబ్ లోకి వచ్చేస్తున్నాయో, అలాగే ఆన్ లైన్ ఫ్లాట్ ఫారమ్ మీదకు వచ్చేస్తున్నాయో, అందరూ చూసేస్తున్నారు. అందువల్ల తెలుగులో చూసేసరికి ఆ ఫీల్ పోతోంది. సినిమాల మీద ఆసక్తి తగ్గిపోతోంది.

ఆ మధ్య వచ్చిన జాను విషయంలో అదే జరిగింది. యూ ట్యూబ్ లో జాను మాతృక 96 సినిమాను చాలా మంది చూసేసారు. దాంతో జాను సినిమా సిన్సియర్ రీమేక్ అయినా కూడా జనం చూడలేదు. 

ఇప్పుడు తడమ్ రీమేక్ చేస్తున్న హీరో రామ్ అండ్ కో అదే భయపడుతున్నారు. పైగా తడమ్ థ్రిల్లర్. సినిమా అంతా ఓ కీలకమైన పాయింట్ మీదే నడుస్తుంది. అది కూడా క్లయిమాక్స్ లో రివీల్ అవుతుంది. ఇప్పుడు జనం కనుక యూ ట్యూబ్ లో వున్న థడమ్ హిందీ డబ్బింగ ను చూసేస్తే, ఆ ప్రభావం రెడ్ సినిమా మీద పడుతుంది.

బహుశా అందుకే కావచ్చు, తడమ్ రీమేక్ అయిన రెడ్ టీజర్ ప్రారంభంలో బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్ అనే నోట్ పెట్టారు. అలా చూసి, జనం ఇది కొత్త సినిమా అని అనుకుంటారనేమో? కానీ ఈ రోజుల్లో ఏదీ దాగదు. రెడ్ సినిమా తడమ్ రీమేక్ అని తెలియకుండా వుంటుందా?

క్రైమ్ జరగక ముందే ఆపడానికి వచ్చే టీం

Show comments