ఇవాళ కోర్టుకు.. బాబు కోరిక తీరేనా...?

విశాఖపట్నంలో చంద్రబాబునాయుడును విమానాశ్రయంలోనే నిలువరించడం.. తిప్పి వెనక్కు హైదరాబాదు పంపడం అనే వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ ఇవాళ అమరావతిలోని హైకోర్టును ఆశ్రయించనుంది. శుక్రవారం కోర్టు కార్యకలాపాలు ప్రారంభం అయిన వెంటనే.. ఈ విషయంపై కేసు వేయడానికి ఇప్పటికే తెలుగుదేశం నాయకులు అంతా సిద్ధం చేసుకున్నారు. చంద్రబాబు పిలుపు ఇచ్చన ప్రజా చైతన్య యాత్ర.. విశాఖ పట్టణం, విజయనగరం జిల్లాల్లో కూడా కొనసాగించడానికి అనుమతులు ఇవ్వాల్సిందిగా.. తదనుగుణంగా పోలీసులకు సూచనలు చేయాల్సిందిగా ఆ పిటిషన్ లో తెలుగుదేశం నాయకులు కోర్టును కోరనున్నారు.

అయితే కోర్టుకు వెళ్లడం ద్వారా చంద్రబాబునాయుడు ఏం సాధించబోతున్నారు? మహా అయితే.. ఈసారి తెలుగుదేశం అడిగినపపుడు చైతన్యయాత్రకు అనుమతులు ఇవ్వాలని హైకోర్టు  ఆదేశించగల అవకాశం ఉంది. అయితే తెలుగుదేశం కోరుకున్నరీతిలో అది జరగకపోవచ్చు. అదే సమయంలో గురువారం నాటి ఎపిసోడ్ కు సంబంధించి.. పోలీసులను ఇరికించాలని చూస్తున్న చంద్రబాబునాయుడు ఆశ కూడా నెరవేరకపోవచ్చు.

పోలీసులు తనను అడ్డుకున్నప్పటినుంచి చంద్రబాబు.. ఆ వ్యవహారాన్ని పెద్ద రాద్ధాంతంగా చేయాలని పలువిధాలుగా ప్రయత్నించారు. నన్ను కాల్చేయండి.. ఎన్ కౌంటర్ చేయండి అంటూ చంద్రబాబు నినాదాలు చేశారు. పోలీసుల మీద విరుచుకుపడ్డారు. ఆ రకంగా ఆ మాటలతో పతాక శీర్షికల్లోకి రాగలిగారు. అదే సమయంలో.. న్యాయపరంగా పోలీసుల చర్యను ఇరికించడానికి ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

శాంతి భద్రతల దృష్ట్యా చంద్రబాబును తిరిగి వెళ్లిపోవాల్సిందిగా పోలీసులు ఎంతగా కోరినప్పటికీ పట్టించుకోని చంద్రబాబునాయుడు తనను ఎందుకు అడ్డుకుంటున్నారో లిఖితపూర్వకంగా ఇవ్వాలని పదేపదే పట్టుపట్టారు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ గా దానిని కోర్టు ఎదుట పెట్టవచ్చుననుకున్నారు. కానీ.. పోలీసులు ఆయన భద్రతకోసం 151వ సెక్షన్ కింద అరెస్టు చేస్తున్నట్టు లేఖ ఇచ్చారు. ఆ లేఖను కోర్టులో పెట్టినప్పటికీ.. చంద్రబాబు ఆశించినట్లుగా ప్రభుత్వాన్ని ఇరికించడం ఆయనకు కుదరకపోవచ్చు.

మహా అయితే.. చంద్రబాబు కాన్వాయ్ పై కోడిగుడ్లు చెప్పులు విసిరిన గుంపులను ముందుజాగ్రత్తగా నిలువరించలేకపోయినందుకు పోలీసులు జవాబు చెప్పాల్సి వస్తుందే తప్ప.. వారికి కోర్టు మందలింపులు వస్తాయే తప్ప.. కోర్టుకు వెళ్లడం ద్వారా చంద్రబాబు పెద్దగా సాధించేది లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన యాత్రకు అనుమతులు రావొచ్చు. కానీ.. పోలీసులు అనుమతులిచ్చే సందర్భంలో మరినిన నిబంధనలను బిగించవచ్చునని ఊహలు సాగుతున్నాయి.

సీన్ రివర్స్ అయింది..!

Show comments