వారెవ్వా కేసీఆర్! శెభాష్!!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన విలక్షణ శైలిని మరోమారు నిరూపించుకున్నారు. ఈసారి కేవలం ఆయన మాత్రమే కాదు.. ఆయన నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకునే అధికార గణం కూడా అంతే విలక్షణతను చాటిచెప్పారు. మొత్తానికి కేవలం గంటల వ్యవధిలోనే అనేక వ్యవహారాలు జరిగిపోయాయి. కేసీఆర్ తీరు తెన్నులు, పాలన శైలికి సంబంధించి అప్పుడప్పుడూ కనిపించే చమక్కుల్లో ఇది కూడా ఒకటి.

వీలైతే.. అల్లా అనుగ్రహిస్తే ముఖ్యమంత్రి కళ్లలో పడవచ్చునని.. తన సమస్యకు ఏదైనా  పరిష్కారం దొరుకుతుందేమోనని.. రోడ్డు పక్కన చేతిలో అర్జీ పట్టుకుని నిల్చున్న ఒక వికలాంగుడు... కేవలం కొన్ని గంటల వ్యవధిలో  తన సమస్యలు మొత్తం తీరిపోతాయని బహుశా కలలోనైనా ఊహించిఉండడు. ఆ వ్యక్తి భాగ్యానికి తగ్గట్లుగా కేసీఆర్ అతని మొరాలకించడమూ, ఆదేశాలు ఇవ్వడమూ.. ఆయన సర్కారులోని అధికార గణం కూడా అంతే వేగంగా స్పందించి.. కాసేపటికే సదరు ఆదేశాలను కార్యరూపంలో పెట్టేయడమూ.. ఆ నిర్ణయాల ఫలితం కూడా అభాగ్యుడికి అందడూ అనేది శెభాష్ అని తీరాల్సిన విషయమే.

కేసీఆర్ హైదరాబాదు నగరంలోని టోలిచౌకి ప్రాంతంలో ఒక ప్రెవేటు కార్యక్రమానికి వెళ్లి తిరిగివస్తుండగా.. రోడ్డు పక్కగా ఓ వృద్ధ వికలాంగుడు చేతిలో కాగితం పట్టుకుని కనిపించాడు. సీఎం వెంటనే కారు దిగి ఆ వృద్ధుడి వద్దకు వెళ్లారు. సరిగా నిల్చోలేకపోతున్న ఆ వ్యక్తికి పోలీసులు చేయూత అందించగా, కేసీఆర్ షేక్ హ్యాండ్ ఇచ్చారు. తన కష్టమేమిటో అడిగి తెలుసుకున్నారు.

ఆ అభాగ్యుడు సలీమ్ ప్రమాదంలో కాలు విరిగిన మాజీ డ్రైవరు. కొడుకు అనారోగ్యం వల్ల జరుగుబాటు లేదు. ఆదుకోమని అడిగాడు. కేసీఆర్ వెంటనే అతినిక వికలాంగ పెన్షన్ మరియు రెండు పడగ్గదుల ఇల్లు ఇవ్వాల్సిందిగా కలెక్టరు సూచించాడు. హైదరాబాదు కలెక్టర్ శ్వేతామహంతి వెంటనే టోలి చౌకిలో సలీమ్ ఇంటికి వెళ్లి.. వికలాంగుడిగా సదరం సర్టిఫికెట్ ఉండడంతో అప్పటికప్పుడు వికలాంగ పెన్షన్ ఫిబ్రవరి నెలకు రూ.3016 అక్కడే అందజేశారు. జియాగూడలో డబుల్ బెడ్ రూం ఇల్లు కూడా మంజూరైపోయింది. కేసీఆర్ ఔదార్యం, అధికారుల వేగం ప్రశంసలు పొందాయి.

అయితే.. సదరం సర్టిఫికెట్ కూడా ఉన్న సలీమ్ కు ఇన్నాళ్లుగా వికలాంగ పెన్షన్ ఎందుకు రాలేదు? సీఏం కేసీఆర్ కళ్లలో పడకపోయిఉంటే ఏంటి పరిస్థితి.. ఈ జీవితానికి అసలు పెన్షన్ వచ్చేదేనా? వికలాంగుడికి సహజంగా రావాల్సిన పెన్షన్ ఇన్నాళ్లూ ఎందుకు రాలేదో కూడా అధికారులు విచారిస్తే.. భవిష్యత్తులో తెలంగాణలో ఇలాంటి అభాగ్యులు ఉండరు.

సీన్ రివర్స్ అయింది..!

Show comments