బాబుకు మొక్కు చెల్లించేశారుగా !

ఏపీలో జగన్ తాను ఇచ్చిన హామీలన్నీ కూడా వరసగా చకచకా తీర్చేసుకున్నారు. ఎవరికీ ఎక్కడా ఆయన బాకీ పడడంలేదు. ఇపుడే ఎన్నికలు ఉన్నట్లుగా ఆయన ఖజానాలొ  నిధులు లేకపోయినా పధకాలు అన్నీ ప్రవేశపెడుతున్నారు.

అదే సమయంలో జగన్ రాజకీయ బాకీలు కూడా ఒక్కోటిగా తీర్చేసుకుంటున్నారు. సరిగ్గా మూడేళ్ళ క్రితం 2017 జనవరి 26 రిపబ్లిక్ వేళ జగన్ విశాఖలో ప్రత్యేక హోదా మీద క్యాండీల్ ర్యాలీకి వచ్చారు.

ఆయన్ని విశాఖ ఎయిర్ పొర్టు  నుంచి కదలనీయకుండా చేసి నాడు చంద్రబాబు సర్కార్ ఆడిన డ్రామా అంతా ఇంతా కాదు, శాంతియుతంగా ర్యాలీ చేసుకుంటామని కోరినా కూడా జగన్ని వదిలిపెట్టలేదు.

సరిగ్గా మూడేళ్ళు తిరిగేసరికి ఓడలు బళ్ళు అయ్యాయి. చంద్రబాబు విపక్ష నేత అయ్యారు. ఆయన విశాఖలో టూర్ పెట్టుకున్నారు. అయితే విశాఖలో రాజధాని ఎందుకు అంటూ బాబు గత కొంతకాలంగా చేస్తున్న కామెంట్స్ తో విసిగిన జనంఎయిర్ పొర్టు  కు వచ్చి అడ్డుకున్నారు

దాంతో బాబు టూర్ ఇక సాగదని పోలీసులు చెప్పి మరీ ఆయన్ని అరెస్ట్ చేశారు. దాంతో వీఐపీ లాంజిలో బాబు ఉండిపోవాల్సివచ్చింది. దీనిమీద విలేకరులు బాబుకు గతంలో జగన్ని అరెస్ట్ చేసిన ఘటనను గుర్తు చేయగా బాబు అపుడు వేరు, ఇపుడు వేరు అంటూ సమాధానం దాటవేయడం గమనార్హం.

మొత్త్తానికి జగన్ జనాలకే కాదు బాబు మొక్కు కూడా తీర్చేసుకున్నారని సెటైర్లు పడుతున్నాయి. బాబు తాజా స్థితిని  చూసిన వారు కూడా  ఎవరు చేసుకున్న పాపం వారినే వెంబడిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.