మాకు సంబంధం లేదంటే కుదరదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కి సంబంధించి వివాదాలు  రేగుతున్న తొలి రోజుల నాటి నుంచి కేంద్ర ప్రభుత్వం అంటే అవలంభిస్తోంది. అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వ్యవహారం అని అందులో కేంద్రం జోక్యం చేసుకోదని, రాజధాని ఎక్కడ ఉండాలి అనేది.. రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించుకోవచ్చు ఆ పార్టీ నాయకులు కొందరు వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. అదే సమయంలో స్థానిక నాయకులు కొందరు రాజధాని తరలింపు వ్యతిరేకిస్తున్నారు.  రాజధాని విషయంలో ఫైనల్గా ఏం జరిగినా సరే,  తమకు ఇబ్బంది లేకుండా భారతీయ జనతా పార్టీ గోడమీద పిల్లి వాటం అనుసరిస్తోంది.

అయితే ఈ రకంగా తప్పించుకునే వైఖరిని కొనసాగించడం ఇంకా కుదరకపోవచ్చు.  తాజాగా అమరావతి తరలింపునకు వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన పిటిషన్లను కేంద్ర ప్రభుత్వం కూడా అతడు  అఫిడవిట్ దాఖలు చేయాలని హై కోర్టు  సూచించింది.  అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే నిధులు విడుదల చేసి ఉన్నందున... అక్కడ జరిగిన పనులు,  అవి కొనసాగుతున్న తీరు ,తరలింపు ప్రయత్నాల గురించి కేంద్రం కూడా అఫిడవిట్ దాఖలు చేయాలనేది  హైకోర్టు ఉద్దేశం.

అధికార వికేంద్రీకరణకు సంకల్పించిన తరువాత జగన్మోహన్ రెడ్డి సర్కారు చీఫ్ జస్టిస్ తో కూడిన  హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని,  ఎగ్జిక్యూటివ్ రాజధానిని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. శాసన రాజధాని మాత్రం అమరావతిలోని కొనసాగుతుంది.

అయితే హైకోర్టును తరలించడం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోని వ్యవహారం కాదని ఇప్పుడు వాదనలు వినవస్తున్నాయి.  నిజానికి జగన్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం అమల్లోకి రావాలంటే కేంద్రం దాన్ని ఆమోదించి న్యాయ శాఖ ద్వారా సుప్రీంకోర్టుకు పంపవలసి ఉంటుంది. అంతిమ నిర్ణయాధికారం సుప్రీంకోర్టు చేతిలో ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో రాజధాని విషయంలో తమకు సంబంధం లేదంటూ తప్పించుకోవడం సాధ్యం కాదు.

నిజానికి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని భారతీయ జనతా పార్టీ తమ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది.  ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు అందుకు సహకరించవలసిన బాధ్యత కూడా కేంద్రంపై ఉంటుంది. మరి ఇప్పుడు కేంద్రం ఎలా స్పందిస్తుందో, మార్చి 30వ తేదీన తదుపరి విచారణ జరిగే లాగా హై కోర్టుకు సమర్పించే అఫిడవిట్ లో ఏమని పేర్కొంటుందో వేచి చూడాలి.

బాధపడుతున్న వంశీ పైడిపల్లి

Show comments