ఒరేయ్‌ బుజ్జిగా..సాంగ్ మేకింగ్ వీడియో

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్  కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో తయారవుతున్న సినిమా ‘ఒరేయ్‌ బుజ్జిగా...`. ఉగాది కానుకగా మార్చి 25 విడుద‌ల‌వుతుంది. రీసెంట్‌గా  ఈ చిత్రం నుండి అనూప్ రూబెన్స్ సంగీత సార‌థ్యంలో  అర్మాన్‌ మాలిక్‌, పి.మేఘన ఆల‌పించిన  ‘కురిసెన.. కురిసెన.. తొలకరి వలపులె మనసున..మురిసెన.. మురిసెన.. కలలకి కనులకి కలిసెన..’ సాంగ్ ని విడుదల చేసారు.   ఈ సాంగ్ మేకింగ్ వీడియోను ఇప్పుడు విడుదల చేసింది చిత్ర‌యూనిట్‌.

సందర్భంగా యంగ్ హీరో రాజ్ త‌రుణ్ మాట్లాడుతూ  -  ఈ మ‌ధ్య కాలంలో వ‌న్ ఆఫ్ బెస్ట్ లోకేష‌న్స్‌లో చిత్రీకరించిన ల‌వ్‌లీ డ్యూయెట్ ఇది. క‌చ్చితంగా ఐ.ఆండ్రూ ఫోటోగ్రఫీ ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్‌ అవుతుంది`` అన్నారు.

హీరోయిన్  మాళవిక నాయర్ మాట్లాడుతూ  - `` చిత్రంలో ఓ మంచి సిట్యుయేషన్‌లో వచ్చే ఫ‌స్ట్ సాంగ్ ఇది. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేశారు.  ఐ.ఆండ్రూ ఈ పాటను అందమైన లొకేషన్లలో చిత్రీకరించారు` అన్నారు.

చిత్ర నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ - ‘‘కురిసెన.. కురిసెన` పాట విడుదలైన కొద్ది క్షణాల్లోనే  సోష‌ల్ మీడియాలో చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది.   పాట ఎంతో బాగుందంటూ నా మిత్రులు ఫోన్ చేసి అభినందిస్తున్నారు. ఈ పాట‌కు వ‌చ్చిన క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు సాంగ్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేస్తున్నాం. పాట మాదిరిగానే ఈ వీడియోకు మంచి రెస్పాన్స్ వ‌స్తుంద‌ని ఆశిస్తున్నాను. ’’ అన్నారు.

Show comments