ప్రచారంలో గెలిచింది.. వాస్తవంగా ఓడిపోయింది

తప్పో ఒప్పో.. అమరావతి ఆందోళనలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం కల్పించడంలో టీడీపీ విజయవంతమైంది. అమరావతి ప్రాంతంలో రైతులు చేస్తున్న ఆందోళనలు.. కార్పొరేట్ కాలేజీ ర్యాంకుల్లాగా... ఒకటీ, ఒకటీ, పదీ, పదీ, ఇరవై, ఇరవై అంటూ చెప్పుకుంటూ పోతున్నా.. ఇన్నాళ్లూ అది కేవలం టీడీపీ అనుకూల మీడియాకే చెల్లింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి మినహా ఇంకెవరూ అమరావతి డ్రై సబ్జెక్ట్ జోలికి పోలేదు, కనీసం జనాలకు కూడా ఇంట్రస్ట్ లేని టాపిక్ కావవడంతో అమరావతి గొడవ లెక్కలకే కానీ, రికార్డులకెక్కలేదు.

అనూహ్యంగా టీడీపీ చేసిన అతి వల్ల ఇటీవల దీనికి విపరీతమైన ప్రాధాన్యం దక్కుతోంది. ఎమ్మెల్యే రోజా, ఎంపీ నందిగం సురేష్ ని పెయిడ్ బ్యాచ్ అడ్డుకోవడం, దాన్ని టీడీపీ అనుకూల మీడియా ప్రముఖంగా చూపించడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో వైసీపీ మీడియా కూడా అమరావతికి స్పేస్ ఇవ్వాల్సి వచ్చింది.

అమరావతి ఆందోళనలకు అనుకూలమో, ప్రతికూలమో అనే విషయాన్ని పక్కనపెడితే.. మీడియా అంతా ఆ విషయంపై ఫోకస్ పెట్టక తప్పని పరిస్థితి కల్పించారు. ఇక దీనికి కొనసాగింపుగా ఎంపీ నందిగం సురేష్ సహా మిగతా వైసీపీ నేతల కామెంట్లు కూడా ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చాయి. అలా టీడీపీ అనుకున్నది నెరవేరిందన్న మాట. అమరావతి గురించి రాష్ట్రమంతా చర్చించుకుంది. అదే సమయంలో టీడీపీ అతిపెద్ద తప్పు చేసింది.

ఎంపీ సురేష్ పై జరిగిన దాడి వ్యవహారంతో అసలు అమరావతి రైతులపై ఎక్కడో ఏదో మూల ఉన్న ఆ కాస్త సింపతీ కూడా పూర్తిగా కొట్టుకుపోయింది. అమరావతి అంటేనే అది పెయిడ్ ఆర్టిస్ట్ ల నేల అని అర్థం వచ్చేలా టీడీపీ, దాని అనుకూల మీడియా ప్రవర్తించింది.

కేవలం కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం, ఇంకొంతమంది బడా బాబుల కోసం మాత్రమే అమరావతి ఆందోళనలు జరుగుతున్నాయనేది వాస్తవం. ఇన్నాళ్లూ రైతులు కూడా రోడ్డెక్కుతున్నారని, పనులు మానుకుని, రోడ్డుపై వంటా వార్పు చేసుకుంటున్నారని అనుకున్నాళ్లు కూడా ఈ రెండు సంఘటనలతో వాస్తవాలను అర్థం చేసుకున్నారు.

నిరసన ప్రదర్శనలు చేస్తున్నవారిలో సామాన్యులెవరూ లేరు. అందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన టీడీపీ సానుభూతిపరులు. ఇంకొంతమంది రోజు కూలీ లెక్కన ఆందోళనల్లో పాల్గొంటున్న వారు. మొత్తమ్మీద.. అమరావతి నాటకం మరోసారి బైటపడింది. ప్రచారంలో గెలిచినా, వాస్తవాలు బైటకు రావడంతో టీడీపీ ఓడింది.

బాధపడుతున్న వంశీ పైడిపల్లి