మారుతి..సుధీర్ ఇవ్వలేనిది

హారిక హాసిని బ్యానర్ కు అనుబంధంగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ ను స్టార్ట్ చేసిన తరువాత సినిమాలు తీస్తూనే వున్నారు. ప్రేమమ్ ఒకె అనిపించుకుంది. బాబు బంగారం అమ్మకాల మీద డబ్బులు వచ్చాయి కానీ సినిమా బంగారం కాలేకపోయింది. శైలజరెడ్డి అల్లుడు ఎవ్వరికీ నచ్చలేదు. జెర్సీకి మాంచి అప్లాజ్ వచ్చింది కానీ డబ్బులు సరిపోలేదు. రణరంగం గట్టి షాక్ ఇచ్చింది. ఏడెనిమిది కోట్లు ఎత్తుకుపోయింది. 

ఇలాంటి టైమ్ లో సితార సంస్థను హ్యాపీ చేసే సినిమా వచ్చింది భీష్మ రూపంలో. అంత అనుభవం వున్న మారుతి సరైన సినిమా ఇవ్వలేకపోయారు. సూపర్ డైరక్టర్ అనుకున్న సుధీర్ వర్మ చేయలేకపోయారు. రెండో సినిమాతో వెంకీ కుడుముల సేఫ్ జోన్ లో గేమ్ ఆడి, శభాష్ అనిపించేసుకున్నాడు. చిత్రమేమిటంటే సితారలో అందరికన్నా ఎక్కువ రెమ్యూనిరేషన్ డ్రా చేసింది మారుతినే. కానీ ఆయనే  హిట్ ఇవ్వలేకపోయారు. అందరికన్నా ఎక్కువ ఖర్చు చేయించింది సుధీర్ వర్మనే. ఆయన ఏకంగా డిజాస్టర్ నే ఇచ్చారు.

పాతిక కోట్ల వరకు ఖర్చు చేయించినా, పది కోట్ల టేబుల్ ప్రాఫిట్ తో విడుదలయింది భీష్మ. ఇప్పుడు ఈ సినిమా కనుక 40 కోట్ల మార్కుకుచేరుకోగలిగితే ఇదే సితార కు పెద్ద సినిమా అవుతుంది. అదే విధంగా హారిక హాసినిలో త్రివిక్రమ్ డైరక్షన్ లో నితిన్ హీరోగా తీసిన అ..ఆ సినిమాను దాటేసినట్లు అవుతుంది. 

ఇదిలా వుంటే తొలి రోజు నితిన్ సినిమా ఆరు కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఇది కూడా కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే. తెలుగు రాష్ట్రాల అమ్మకాలు జస్ట్ 18 కోట్ల మేరకే. అంటే తొలి మూడు రోజుల్లోనే చాలా వరకు బయ్యర్లు సేఫ్ జోన్ కు వెళ్లిపోయే అవకాశం వుంది. నితిన్ కు, సితారకే కాదు, వెంకీ కుడుముల కు కూడా ఈ విజయం ఆనందమే.  సితారకు మారుతి, సుధీర్ వర్మ, చందు మొండేటి, ఇవ్వలేనిది వెంకీ ఇచ్చాడు కదా? 

తొలి రోజు వసూళ్లు

Nizam 2.20Cr
Ceeded 0.80
Vizag 0.62
Guntur 0.77
East 0.66
West 0.56
Krishna 0.40
Nellore 0.27
Total Share 6.28cr

Show comments