నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

వరుసగా మూడు ఫ్లాపులిచ్చాడు. అయినప్పటికీ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నాడు నితిన్. అతడు నటించిన భీష్మ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. సంక్రాంతి సినిమాల తర్వాత మరో పెద్ద సినిమా పడకపోవడం, సినిమాపై అంచనాలు ఉండడంతో పాటు భారీ ఎత్తున థియేటర్లు దొరకడం భీష్మకు కలిసొచ్చింది.

నిన్న రిలీజైన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల 28 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు వసూళ్లు 8 కోట్ల రూపాయల మార్క్ అందుకున్నాయి. నితిన్ కెరీర్ లో ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా హయ్యర్స్ తో కలుపుకొని 20 కోట్ల రూపాయల మేర ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. సినిమాకు మొదటి రోజే హిట్ టాక్ రావడం, మరో సినిమా పోటీలో లేకపోవడంతో మరో 5 రోజుల్లో ఈ సినిమా బ్రేక్-ఈవెన్ అయ్యే అవకాశాలున్నాయి.

వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ క్లిక్ అయింది. మూవీలో 4-5 కామెడీ బ్లాక్స్ బ్రహ్మాండంగా పేలాయి. డైలాగ్స్, మ్యూజిక్, రష్మిక అందాలు కూడా సింక్ అవ్వడంతో సినిమా హిట్ అయింది. ఏపీ,నైజాంలో భీష్మ సినిమాకు మొదటి రోజు వచ్చిన షేర్స్ (కోట్లలో) ఇలా ఉన్నాయి

నైజాం - 2.20 కోట్లు
సీడెడ్ - 0.80 కోట్లు
ఉత్తరాంధ్ర - 0.62 కోట్లు
గుంటూరు - 0.77 కోట్లు
ఈస్ట్ - 0.66 కోట్లు
వెస్ట్ - 0.56 కోట్లు
కృష్ణా - 0.40 కోట్లు
నెల్లూరు - 0.27 కోట్లు

రష్మిక లెగ్గుతో నితిన్ కి

Show comments