మరో మాజీ మంత్రి బండారం రెడీ ?

ఉత్తరాంధ్ర జిల్లాలు టీడీపీకి పట్టుకొమ్మలు అన్నది  ఒకప్పటి మాట. ఇపుడు అక్కడ అంతా వూడ్చేసి వైసీపీ ఫ్యాన్ వేసుకుని కూర్చుంది. సరే ఉన్న నాయకులు తిన్నగా ఉన్నారా అంటే గత పాపాలు చాలామందిని వెతికి వెంటాడుతున్నాయట. తాజగా సిక్కోలు కీలకనేత అచ్చెన్నాయుడు కార్మిక మంత్రిగా ఉండగా ఈఎస్ఐ లో పెద్ద ఎత్తున చేసిన కొనుగోళ్ళ గోల్ మాల్ పైన వైసీపీ సర్కార్ గురి పెట్టింది. 

ఇపుడు మరో ముఖ్య నేత మాజీ మంత్రి కూడా ఇదే వరసలో ఉన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయ‌ణమూర్తి భూ భాగోతాలపైన కూడా తగిన ఆధారాలతో నిరూపిస్తామని వైసీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి అంటున్నారు.

పెందుర్తి ఎమ్మెల్యేగా ఆయన హయాంలో జరిగిన పెద్ద ఎత్తున భూ దందాలపైన అని వివరాలూ ప్రభుత్వం దగ్గర ఉన్నాయని, వాటిని కూడా వెలుగులోకి  తెచ్చి తప్పు చేసిన వారిపైన చర్యలు తీసుకుంటామని అంటున్నారు.

ఇక ఉత్తరాంధ్రా జిల్లాల్లో మాజీ మంత్రులు ఇంకా చాలా మందే ఉన్నారు. వారు టీడీపీ హయాంలో అలా ఇలా కాకుండా పెద్ద చక్రాలే తిప్పారు. దాంతో ఇపుడు అచ్చెన్న తరువాత ఎవరు అన్న దాని మీద తమ్ముళ్ళల్లో ఒక్కసారిగా  కలవరం పెరిగిపోతోంది. అలాగే చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు కూడా నాడు కింగులుగా, కింగ్ మేకర్లుగా బాగానే  హవా చలాయించారు.

మరి ప్రభుత్వమే ఏకంగా గురి పెడితే, గట్టిగా టార్గెట్ చేస్తే చాలామంది అవినీతి చిట్టాలు బయటకు వస్తాయని అంటున్నారు. తాము అదే పనిలో ఉన్నామని వైసీపీ నేతలు చెప్పడంతో పసుపు పార్టీ పెద్దల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి.

అంతా మోడీ చెప్తేనే చేసాను.. నా తప్పు లేదు

Show comments