హోదాపై మాట్లాడే హక్కు వారికసలుందా?

ఆరేళ్లుగా ప్రత్యేకహోదా  అనేది రాష్ట్రానికి దక్కకపోవడం గురించి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఇప్పటిదాకా హోదా ఇవ్వకుండా మోసం చేస్తోందని, కేంద్రం మెడలు వంచి హోదా తెస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన రెడ్డి... ఇప్పుడు కేంద్రం వద్ద సాగిలపడుతున్నారని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఎద్దేవా చేస్తున్నారు. భాజపా పట్టించుకోకపోయినా, విభజన హామీలు- ప్రత్యేకహోదా కోసం కాంగ్రెస్ పోరాడుతుందని ఆయన చెబుతున్నారు.

నిజానికి ప్రత్యేకహోదా గురించి.. ఇతర రాజకీయ పార్టీల కృషిని నిందించే, ప్రయత్నాన్ని తప్పుపట్టే నైతికహక్కు కాంగ్రెస్ కు అసలుందా అనేది ప్రశ్నార్థకం. ఎందుకంటే... రాష్ట్రాన్ని అత్యంత అసహ్యకరమైన రీతిలో చీల్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ నేపథ్యంలోనే ఆంద్రప్రదేశ్ అన్యాయానికి గురవుతున్నదనే ఉద్దేశంతో ప్రత్యేక హోదాను  ప్రకటించారు. కేబినెట్ సమావేశంలో కూడా తీర్మానించారు. కానీ  కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చేసిన అతిపెద్ద ద్రోహం ఏంటంటే.. ప్రత్యేకహోదా అంశాన్ని విభజన చట్టంలో చేర్చకపోవడం.

ప్రధాని పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీ, కేబినెట్ తీర్మానం వంటి పడికట్టు పదాలు ఇప్పుడు పనిచేయడం లేదు. ‘చట్టంలో హోదా అంశం లేదు’ అనే అంశాన్ని పట్టుకుని.. భాజపా సర్కారు దానిని నెరవేర్చే పూచీ తమది కాదన్నట్లుగా తప్పుకుంది. ఇక ఎవ్వరికీ గట్టిగా అడిగే అధికారం కూడా లేకుండా పోయింది. ప్రత్యేకహోదా విషయంలో పరిస్థితి ఇంత దారుణంగా మారడానికి.. కేవలం కాంగ్రెస్ పాపమే కారణం.

అలాంటిది.. ఇవాళ తగదునమ్మా అంటూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి థర పార్టీలను నిందిస్తున్నారు. జగన్మోహన రెడ్డి ప్రయత్నాల్ని ఎద్దేవా చేస్తున్నారు. ప్రత్యేకహోదా అనేది చట్టబద్ధంగా హక్కుగా మనం డిమాండ్ చేసే రోజు పోయింది. అది కేవలం కేంద్ర ప్రభుత్వపు దయాదాక్షిణ్యాలపై మాత్రమే ఆధారపడి ఉంది. ఎంతో సీనియర్ అయిన తులసిరెడ్డి కూడా ఆ విషయాన్ని గుర్తించకపోతే ఎలాగ?

నా మీదనే దాడి చేయిస్తావా

Show comments