సీఎం జగన్ మనసులో మాట చెప్పేసిన రోజా

రాష్ట్రానికి 3 రాజధానులు. అభివృద్ధి వికేంద్రీకరణకు అసలైన ముందడుగు.

ఇదేదో జగన్ ఉన్నఫలంగా తీసుకున్న నిర్ణయం కాదు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జగన్ చాన్నాళ్ల కిందటే ఈ నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే అమలు చేయడానికి ఇంత సమయం పట్టింది. ఈ విషయాన్ని వైసీపీ ఎమ్మెల్యే రోజా బయటపెట్టారు.

"రాష్ట్ర విభజన సయంలో హైదరాబాద్ విషయంలో జరిగిన అనుభవం అందరికీ తెలుసు. కట్టుబట్టలతో అందరం ఆంధ్రాకు వచ్చాం. మళ్లీ ఆ పరిస్థితి రాకూడదంటే ఏపీలో 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి.  అలా చెందాలంటే 3 రాజధానులు ఉండాల్సిందే. దీంట్లో ఎలాంటి కక్షసాధింపు లేదు. పూర్తిగా జగన్ గారు ఎప్పుడో తీసుకున్న నిర్ణయం ఇది. కచ్చితంగా ఆయన 3 రాజధానులు తీసుకొస్తారు. ఇది జరిగి తీరుతుంది."

కేవలం తమపై కక్ష సాధించేందుకు జగన్ ఇలా 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్ని రోజా ఖండించారు. నవరత్నాలపై ఎలాంటి విజన్ తో జగన్ ముందుకెళ్తున్నారో, రాజధాని అంశంపై కూడా ముఖ్యమంత్రికి అలా పూర్తి విజన్ ఉందన్నారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు చేసినట్టు జగన్ అవినీతికి తావివ్వరని స్పష్టంచేశారు.

"అమరావతి పేరిట వేల కోట్ల రూపాయల్ని చంద్రబాబు తరలించారు. సామాజిక రాజధాని నిర్మిస్తామని చెప్పి, తన సామాజిక వర్గానికి చెందిన రాజధానిని నిర్మించడానికి ప్రయత్నించారు. అందుకే ఏకంగా అమరావతి ప్రాంతంలో, మంగళగిరిలో టీడీపీ కాండిడేట్లను ఓడించారు ప్రజలు. ఇది చాలదన్నట్టు ఇప్పుడు ప్రజాచైతన్య చేస్తున్నారు. అది ప్రజాచైతన్య యాత్ర కాదు.. ప్రజలు ఛీ కొడితే ఓ పిచ్చోడు చేస్తున్న యాత్ర."

చంద్రబాబు కేవలం 4 గ్రామాల గురించి ఆలోచిస్తున్నారని, జగన్ మాత్రం 13 జిల్లాల్లో 4 కోట్ల జనం కోసం ఆలోచిస్తున్నారని అన్నారు రోజా. చంద్రబాబు కంటే మెరుగైన ప్యాకేజీ ఇస్తున్న జగన్ మనసును అమరావతి ప్రాంత ప్రజలు అర్థం చేసుకోవాలని, బాబు గ్రాఫిక్స్ నుంచి బయటపడాలని పిలుపునిచ్చారు రోజా.

ఆ నడుము సీన్లు నాకు సెంటిమెంట్

Show comments