వర్ల వదరుబోతుతనానికి పరాకాష్ట!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి ఒక కొత్త  పథకానికి శ్రీకారం చుడుతున్నారు. నాయీబ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఆర్థిక సాయం చేసేందుకు ఒక పథకాన్ని రూపొందించి దానికి, ‘జగన్ చేదోడు’ అని నామకరణం చేశారు. జరుగబాటుకు కూడా ఇబ్బంది పడుతూ ఉండే చిరువృత్తుల వారిని ఆర్థికంగా ఆదుకోవడం ఈ పథకం లక్ష్యం. అయితే.. తెలుగుదేశానికి చెందిన నాయకుడు వర్ల రామయ్య.. ఈ పథకం పేరు మీద.. చాలా చవకబారు లేకి జోకులు వేస్తూ ఎద్దేవా చేస్తున్నారు.

‘చేదోడు’ అనే పదం అంటేనే ఆయనకు చాలా అభ్యంతరకరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ‘చేదోడు’ అంటే ‘చేదువాడు’ అంటే చెడ్డవాడు అనే అర్థం కూడా వస్తుందిట. 'ముఖ్యమంత్రి గారు...  మీ ప్రభుత్వం తెలుగును ఖూనీ చేస్తుందా? లేక మిమ్ముల్ని అల్లరి చేస్తుందా?' అని ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. . 'ఏమయ్యారు సార్, మీ తెలుగు ప్రపంచ మేధావులు? పేరు మార్చండి' అని ట్వీట్ లో పేర్కొన్నారు.

రెండు అర్థాలేం ఖర్మ.. వర్ల రామయ్య లాగా వదరుబోతుతనంతో.. పీకి పీకి వేర్వేరు అర్థాలు కూడా ఈ పదంలోంచి తీయవచ్చు. అయితే  ‘చేదోడు’ అంటే అర్థం ‘చేయి తోడు’ అని!  చేతలరూపంలో సాయం చేయడం అని దాని భావం. సాధారణంగా.. ‘‘ఎవరైనా చేదోడు వాదోడుగా ఉంటారనే’’ మాటను వాడితే గనుక.. చేదోడు- చేతలరూపంలోనూ... వాదోడు వాయి (నోరు) తోడు అంటే మాటతోడు రూపంలోనూ అండగా ఉంటారనే అర్థం వస్తుంది. అయితే ఈ పదబంధంలో వర్ల రామయ్యకు వెటకారం కనిపించింది.

అయినా.. చేతల్లో సాయం చేసేవారికి ‘చేదోడు’ అనే పదం అర్థం  తెలుస్తుంది గానీ.. చేతల్లో ఏమీ చేయకుండా.. కేవలం మాటలతో మాయపుచ్చుతూ.. గ్రాఫిక్స్ తో రాజధానులు నిర్మిస్తూ ప్రజలను వంచించే వారికి ఆ పదం విలువ ఏం తెలుస్తుంది.. అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వర్ల రామయ్యకు రిటార్టులు ఇస్తున్నారు.

అయినా ప్రతిపక్షం ఇలా లేకితనంతో కాకుండా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. ఒక పథకాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తోంటే.. దాని మార్గనిర్దేశకాల్లో ఏమైనా లోపాలుంటే చెప్పాలి.. ప్రజలకు ఎక్కువ మేలు అందేలా చూడాలి. అంతే తప్ప.. ఇలాటి చవకబారు విమర్శలతో మరింత దిగజారిపోకూడదని ఈ సీనియర్ నాయకుడు తెలుసుకోవాలి.

ఆ నడుము సీన్లు నాకు సెంటిమెంట్

Show comments