వరుణ్ సరసన బాలీవుడ్ అమ్మడు

తెలుగు లో హీరోయిన్ల కొరత విపరీతంగా వుంది. వెదికి వెదికి హీరోయిన్లను తీసుకురావాల్సి వస్తొంది. విజయ్ దేవరకొండ-పూరి సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ అనన్య ను తీసుకువచ్చారు. మెగా హీరో వరుణ్ తేజ్ సరసన కూడా ఓ బాలీవుడ్ హీరోయిన్ నటించబోతోంది. 

దబాంగ్ 3 లో నటించిన సాయి మంజ్రేకర్ ను వరుణ్ తేజ్ బాక్సర్ సినిమా కోసం తీసుకున్నారు. బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కూతురు ఈ అమ్మాయి. సల్మాన్ సరసన దబాంగ్ 3లో నటించింది. ఈ సినిమాను అల్లు అరవింద్ కుమారుడు బాబీ, అతని స్నేహితుడు సందీప్ కలిసి నిర్మిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకుడు.

ఈ సినిమా లో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపిస్తాడు. ఈ గెటప్ కోసం అమెరికా వెళ్లి ఫిజికల్ ఫిట్ నెస్ మెరుగుపర్చుకుని, హెవీ బాడీతో, బియర్డ్ లుక్ తో కొత్తగా తయారై వచ్చాడు వరుణ్ తేజ్. ఈ నెల 24 నుంచి బాక్సర్ షూట్ ప్రారంభమవుతుంది.

ఆ నడుము సీన్లు నాకు సెంటిమెంట్

Show comments