సమాచారం పేరుతో విషం చిమ్ముతున్నారు!

ఒక్క ఆధారం లేదు.. ఒక్క పత్రం లేదు. కనీసం ఒక ఆన్ లైన్ వెబ్ సైట్లలోని పుకారు వంటి సమాచారం కూడా లేదు.. కానీ.. కేవలం ఒక ఊహాగానాన్ని ‘సమాచారం’ అనే ముసుగులో విషంలా ప్రచారం చేస్తూ పచ్చదళాలు చెలరేగిపోతున్నాయి. 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డికి సంబంధించి.. మితిమీరిన దుష్ప్రచారాన్ని సాగిస్తున్నాయి. రస్ అల్ ఖైమా జగన్ ను అప్పగించాల్సిందిగా కేంద్రానికి లేఖ రాసిందంటూ.. ఒక అబద్ధాన్ని ‘విశ్వసనీయ సమాచారం’ పేరిట ప్రచారంలోపెట్టి.. జగన్ మీద బురద చల్లడానికి సాహసిస్తున్నాయి.

ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి.. ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్రమోడీని, రెండో దఫా వెళ్లినప్పుడు హోంమంత్రి అమిత్ షాను, న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ ను కలిసి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ముగ్గురు నేతలను మాత్రమే కలవడంలో.. చాలా తర్కబద్ధమైన కారణాలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి కేంద్రంనుంచి అనుమతి రావడం, సహకారం లభించడం అనేది ఈ మూడు శాఖలకు మాత్రమే సంబంధించిన వ్యవహారం.

రాజధాని ఒకే చోట ఉండాలా? మూడు చోట్ల ఉండాలా? అనేది జగన్మోహన రెడ్డి ప్రభుత్వం ఇష్టం అయినప్పటికీ... కౌన్సిల్ రద్దు గురించి గానీ, చీఫ్ జస్టిస్ తో కూడిన హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయడంగానీ.. కేంద్ర ప్రభుత్వం చొరవతో తప్ప సాధ్యం అయ్యేవి కాదు. ప్రధానంగా అవి హోంశాఖ ద్వారానే కదలాల్సి ఉంటుంది. అందుకే ప్రధానిని కలిసిన తర్వాత.. మళ్లీ ఒకసారి ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లిన జగన్ హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.

హైకోర్టు ఏర్పాటుకు సంబంధించి న్యాయశాఖ ద్వారా కూడా ఫైల్ కదిలి సుప్రీం కోర్టుకు వెళ్లవలసి ఉంటుంది గనుక.. ఆ శాఖ మంత్రిని కూడా కలిశారు.

అయితే రస్ అల్ ఖైమా వారు జగన్ ను అప్పగించాల్సిందిగా.. కేంద్రానికి లేఖ రాసినట్లు తమ వద్ద సమాచారం ఉన్నదని తెలుగుదేశం నాయకులు విషప్రచారం ప్రారంభించారు. అందుకే జగన్ ఢిల్లీ వెళ్లాడని అంటున్నారు. కానీ ఏ ఆధారమూ బయటపెట్టడం లేదు. కేవలం జగన్ ను బద్నాం చేయడానికే ఇలాంటి అబద్ధాల ప్రచారానికి సాహసిస్తున్నారనే వాదన పలువురిలో వినిపిస్తోంది.

ఐటీ కేసుల ఊబిలో కూరుకుపోయిన చంద్రబాబు మీదినుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి.. జగన్ పేరిట అవినీతి కేసులు ఉన్నట్లుగా ఒక ప్రచారం స్టార్ట్ చేసిన పచ్చదళాలు పెట్రేగుతోంటే.. ఎలాంటి న్యాయపరమైన చర్య తీసుకోకుండా జగన్ సర్కారు ఎందుకు ఉపేక్షిస్తున్నదో అర్థం కావడం లేదని ప్రజలు అనుకుంటున్నారు.

నితిన్ కి వాళ్ళ అన్న పవన్ కళ్యాణ్ ఆశీస్సులు ఇమ్మన్నాడు

Show comments