భీష్మలో స్పెషల్ ఆ అమ్మాయే

కుమారి 21 ఎఫ్..ఈ పేరు వినగానే హెబ్బా పటేల్ గుర్తుకు వస్తుంది. ఆ సినిమా, ఆ తరువాత ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాల తరువాత మంచి సినిమా పడలేదు. ఒకటి రెండు ట్రయ్ చేసినా సక్సెస్ లు పలకరించలేదు. కానీ ప్రేక్షకులు మాత్రం కుమారి 21ఎఫ్ లో ఆమె చలాకీతనాన్నీ, కవ్వింపు నటనను మరిచిపోలేదు. 

ఇప్పుడు మరోసారి హెబ్బా రాబోయే భీష్మ సినిమాలో తళుక్కున మెరిసినట్లు తెలుస్తోంది. భీష్మ సినిమాలో కథను టర్నింగ్ తిప్పే కీలకపాత్రలో హెబ్బా కనిపిస్తుందని బోగట్టా. అయితే ఆమెది ఫుల్ లెంగ్త్ రోల్ కాదని తెలుస్తోంది. అలా అని మరీ పాస్ ఆన్ రోల్ కూడా కాదట.

మొత్తం మీద భీష్మ సినిమాతో హెబ్బా మరీ లైమ్ లైట్ లోకి రాకపోయినా, జనాలకు మరోసారి గుర్తు అయితే వస్తుందన్నమాట. నితిన్-రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించారు.

అయన స్క్రీన్ పైన కనిపిస్తే చాలు