ఫుల్లీ ఆర్గానిక్ 'భీష్మ'

నాన్ థ్రిల్లర్, ఎంటర్ టైన్ మెంట్ జోనర్ సినిమాలకు, 'ఇదీ వ్యవహారం' అని వివరంగా చెప్పేయడమే బెటర్. ప్రేక్షకులు కథ మొత్తం ఊహించేసుకుని, రెడీగా థియేటర్ కు వస్తారు. వారు ఊహించుకున్న కథనే, వీలయినంత ఎంటర్ టైన్ మెంట్ జోడించి చెబితే, సినిమా పాస్ అయిపోయే అవకాశం వుంటుంది. నితిన్-రష్మిక కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న భీష్మ ట్రయిలర్ లో ఇదే చేసారు.

సినిమాలో హీరో పరిచయం..తపన..ప్రేమ నుంచి, ఉద్యోగం..విరోధం, లక్ష్యం అంటూ చివరి వరకు కథను స్టెప్ బై స్టెప్ ట్రయిలర్ లో చూపించేసారు. అయితే అదే టైమ్ లో ఇవన్నీ ఎంత లైటర్ వీన్ లో, ఎంత లైవ్లీగా వుంటాయి అన్నది కూడా క్లారిటీ ఇచ్చేసారు. ట్రయిలర్ లో వెన్నెల కిషోర్ స్టీల్ ది షో అయిపోయాడు. రెండే రెండు డైలాగులతో ట్రయిలర్ కు, తనకు మార్కులు తెచ్చేసుకున్నాడు.

రెండు సంస్థల మధ్యవైరం వంటి రొటీన్ సంస్థల మధ్య వైరంలాంటి రొటీన్ టచ్ మధ్యలో ట్రయిలర్ ను కొంచెం డౌన్ చేసినా, ఆర్గానిక్ ఫార్మింగ్ అనే కొత్త పాయింట్ యాడ్ అయింది. కథను ప్రారంభంలో, చివర్న బాగానే డీల్ చేసారు అన్న సంగతి ట్రయిలర్ లో కనిపిస్తంది. కానీ మధ్యలోనే ఎలా చేసారు అన్నది సినిమాలో చూడాలి. ఆ టిపికల్ జంక్షన్ ను స్మూత్ గా క్రాస్ చేసేస్తే సినిమా పాసయిపోయే అవకాశం ఎక్కువగా వుంది. 

ఇప్పటికే వదిలిన మూడు పాటలు బాగానే వైరల్ అయ్యాయనేమో, ట్రయిలర్ లో మరి వాటి జోలికి పోలేదు. అందువల్ల హీరోయిన్ రష్మికకు అంత ప్లేస్ ట్రయిలర్ లో దొరికినట్లు లేదు.

త్రివిక్రమ్, ఎన్టీఆర్ ప్రాజెక్ట్ చాలా పెద్దది

Show comments