ఐటీ సోదాలు.. ర‌ష్మిక ఇంట్లో ఏం దొరికాయి?

సినీ న‌టి ర‌ష్మిక ఇంటిపై ఐటీ అధికారుల సోదాలు ఆస‌క్తిదాయ‌కంగా మారాయి. ప్ర‌స్తుతం సౌత్ లో అత్య‌ధిక పారితోష‌కం అందుకుంటున్న హీరోయిన్ల‌లో, భారీ సినిమాల్లో న‌టిస్తున్న హీరోయిన్ల‌లో ఒక‌రిగా నిలుస్తూ ఉన్న ర‌ష్మిక ఇంటిపై ఐటీ సోదాల సంగ‌తి తెలిసిందే. ఆమె పారితోష‌కం లెక్క‌ల గురించి సినిమా స‌ర్కిల్స్ లో చ‌ర్చ జ‌రుగుతూ ఉన్న స‌మ‌యంలో ఆమె ఇంటిపై ఐటీ రైడ్స్ జ‌రిగాయి.

తెలంగాణ‌, ఏపీ స‌ర్కిల్స్ కు సంబంధించిన అధికారులు కొడ‌గు ప్రాంతంలోని  ఇంట్లో సోదాలు జ‌ర‌ప‌డం గ‌మ‌నార్హం. ఆమె ఆర్థిక వ్య‌వ‌హారాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల‌తో సంబంధం ఉన్న‌విగా మారాయి. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డి అధికారులు కర్ణాట‌క‌కు వెళ్లి సోదాలు నిర్వ‌హించిన‌ట్టుగా ఉన్నారు.

ఇక ఇంత‌కీ ర‌ష్మిక ఇంట్లో ఐటీ అధికారులు ఏం క‌నిపెట్టారు.. అంటే కీల‌క‌మైన ప‌త్రాలు అనే స‌మాచారం వ‌స్తోంది. సీబీఐ, ఐటీ అధికారులు ఎక్కడ‌కు వెళ్లినా ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లే వ‌స్తూ ఉంటాయి. కీల‌క‌మైన ప‌త్రాలను స్వాధీనం చేసుకున్న‌ట్టుగా ప్ర‌క‌ట‌న‌లు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అలాంటి ప్రక‌ట‌నే వ‌చ్చింది.

ఇక ర‌ష్మిక‌పై ఏవైనా కేసులూ గట్రా న‌మోదు అవుతాయా? అనేది ఇంకా క్లారిటీ లేని అంశం. అయితే ఆమెను అధికారులు విచార‌ణ‌కు పిలిచే అవ‌కాశాలు మాత్రం ఉంటాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

Show comments