న్యూ ఇయర్‌ పార్టీలతోనే ఎన్నికల హోరు మొదలు..!

నెలరోజుల ముందు నుంచినే న్యూ ఇయర్‌ వేడుకల గురించి సీమలో రాజకీయ నేతల తరఫున ఏర్పాట్ల హడావుడి మొదలవుతోంది. తమ అనుచర గణానికి భారీస్థాయిలో న్యూఇయర్‌ పార్టీలు ఇచ్చి నేతలు ఉత్సాహపరచడానికి సిద్ధం అవుతున్నారు. అందులోనూ వచ్చేది ఎన్నికల ఏడాది కావడంతో.. ఈసారి పార్టీల దగ్గర నుంచి తమ పరపతి ఏమిటో చూపించడానికి నేతలు రెడీ అయిపోతున్నారు.

అటు అధికార పార్టీ వాళ్లు, ఇటు ప్రతిపక్ష పార్టీ ఇన్‌చార్జిలు తమ అనుచరవర్గానికి న్యూ ఇయర్‌ పార్టీలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి న్యూ ఇయర్‌ పార్టీలు మరింత ప్రతిష్టాత్మకం అవుతోంది. ఎవరికి వారు తమసత్తా ఏమిటో చూపించడానికి వీటిని వేదికలుగా మార్చుకుంటున్నారు.

ప్రత్యేకించి ఒక్కో నియోజకవర్గంలో వేర్వేరు అభ్యర్థులు టికెట్ల కోసం పోటీపడుతున్న చోట ఈ పార్టీలు మరింత హాట్‌గా మారుతున్నాయి. ఈ విషయంలో ఇలాంటి వారు పోటీలు పడుతున్నారు. ఆళ్లగడ్డలో ఇలాంటి సీనే చోటు చేసుకుంటోంది. ఇక్కడ మామా, కోడళ్ల పోరు కొనసాగుతూ ఉంది.

ఎవరు బాగా పనిచేస్తే వాళ్లకే టికెట్‌ అంటూ చంద్రబాబు నాయుడు చెప్పడం ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియల మధ్య పోరుగా మారింది. ఇది కొనసాగుతూనే ఉంది. ఈసారి ఆళ్లగడ్డలో గ్రాండ్‌ పార్టీ ఏర్పాట్లు చేసి తనసత్తా చూపించాలని, క్యాడర్‌ను తనవైపుకు తిప్పుకోవాలని ఏవీ సుబ్బారెడ్డి ప్రయత్నాలు తీవ్రతరం చేశాడు.

అయితే అఖిలప్రియ కూడా న్యూ ఇయర్‌ పార్టీని గ్రాండ్‌గా నిర్వహించడానికి రెడీ అయ్యిందట. అంతా తనవైపే ఉన్నారని నిరూపించుకోవడానికి ఆమె ఈ పార్టీని వేదికగా చేసుకుంటోందని సమాచారం.

తెలంగాణ తీర్పు ప్రభావం.. ఏపీపై ఉంటుందా? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments