బీజేపీకి కొత్త జాతీయాధ్యక్షుడు రాబోతున్నారా?

ఒకవైపు కేంద్రంలో హోంమంత్రి పదవి వంటి కీలకమైన పదవిని చేపట్టి కూడా తనే భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నారు అమిత్ షా. ఒకే వ్యక్తికి ఇలా రెండు కీలకమైన పదవులు ఇవ్వడం ఏ పార్టీలో అయినా చర్చకు తావిస్తూ ఉంటుంది.  అయితే ఇప్పుడు కమలం పార్టీలో మోడీ, అమిషాల కత్తులకు తిరుగులేదు. తమకు ప్రాధాన్యత గల పదవులు దక్కకపోయినా సీనియర్లు నోరెత్తే పరిస్థితి లేదు.

అక్కడకూ తనకు శాఖను మార్చడం పట్ల రాజ్ నాథ్ సింగ్ బాగా అసహనం వ్యక్తం చేసినట్టుగా వార్తలు వచ్చాయి. ఇక చాలామంది సీనియర్లను డెబ్బై ఐదేళ్ల వయసు దాటిందని పక్కకు  పంపించేశారు. ఇలాంటి నేపథ్యంలో అమిత్ షా అటు హోం మినిస్టర్ గా, ఇటు బీజేపీ జాతీయాధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నారు.

వచ్చే ఐదేళ్లూ ఇలాగే కొనసాగినా షాను అడిగేవాళ్లు ఉండకపోవచ్చు భారతీయ జనతా పార్టీ నుంచి. అయితే ఏమైందో ఏమో కానీ, అమిత్ షా భారతీయజనతా పార్టీ జాతీయాధ్యక్ష పదవి నుంచి వైదొలగబోతున్నారట. త్వరలోనే కమలం పార్టీకి కొత్త జాతీయాధ్యక్షుడు రాబోతున్నారని సమాచారం. 

అయితే అది ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్. తను రెండు పదవులతో సూపర్ అనిపించుకోవాలని అనుకోవడం లేదంటున్నారట అమిత్ షా. మరొకరిని జాతీయాధ్యక్ష పదవిలో నియమించడానికి రంగం సిద్ధం అవుతోందని సమాచారం!

అప్పుడు బ్లాక్ మెయిలర్.. ఇప్పుడు చీటర్.. రవి ప్రకాష్!