న్యూ ఏజ్ యాక్షన్ మూవీ 'ఖైదీ' - కార్తీ

తమిళంలో చిన్న సినిమా, పెద్ద సినిమా, ఈ జోనర్, ఆ జోనర్ అనే తేడాలు లేకుండా, విభిన్న ప్రయోగాలు చేసే హీరో కార్తీ. లేటెస్ట్ గా కార్తీ చేసిన సినిమా ఖైదీ. దీపావళి సందర్భంగా ఈ సినిమాను ఈవారం విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా కార్తీ మీడియాతో మాట్లాడిన విషయాలు.

ప్రాజెక్టు.. డైరక్టర్
డైరక్టర్ లోకేష్  కనకరాజ్‌ షార్ట్ ఫిలిమ్స్ చేసి ఇండస్ట్రీకి వచ్చారు. ఫస్ట్ మూవీ తోనే  చాలా పెద్ద హిట్అందుకున్నారు. ఈ కథ చెప్పేటప్పుడే ఇదొక కొత్త ఐడియా అని చెప్పారు. ఒక రాత్రి జరిగే నాలుగు గంటల్లో జరిగే కథ ఇది.  ఆ నాలుగు గంటల్లోనే చాలా సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. దీన్ని ఒక భారీ బడ్జెట్ సినిమాగా తీస్తే తప్పకుండా సక్సెస్ అవుతుంది అనిపించింది. అలా ఈ ప్రాజెక్ట్ ఓకే అయింది.

క్యారెక్టర్
ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన విషయం నా క్యారెక్టరైజేషన్. పది సంవత్సరాల జైలు జీవితం ముగించుకొని బైటికి వచ్చే ఒక 'ఖైదీ' క్యారెక్టర్. తాను ఇప్పటివరకూ చూడని ఒక కూతురు ఉంటుంది. తను ఎలా ఉంటుందో  కూడా తెలీదు. అన్ని అవాంతరాలని దాటుకొని తన కూతురిని చూడగలిగాడా? లేదా? అనేది కథ. పది సంవత్సరాలు తన కూతురిని చూడలేదు అంటే నాకు కూడా పెర్ఫామెన్స్ చేయడానికి స్కోప్ ఉంటుంది అనిపించింది.

కూతురు లేనపుడు.. ఉన్నపుడు
నాకు ఒక కూతురు ఉండడం వల్ల నాన్నగా నటించడం ఈజీ అయింది. నేను గతంలో విక్రమార్కుడు మూవీని తమిళ్ లో రీమేక్ చేసే టప్పుడు నాకు ఒక కూతురు ఉంటే ఇలా ఉంటుంది అని ఇమాజిన్ చేసుకొని నటించాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు అలాంటి సమస్య ఏమి లేదు కాబట్టి అంతా హ్యాపీ గానే జరిగింది.

మాంచి డైలాగులు
డైలాగులు ట్రైలర్ లో వినిపించింది చాలా తక్కువ రేపు సినిమాలో డైలాగ్స్ కి థ్రిల్ ఫీల్ అవుతారు. ప్రతి సీన్ ఫ్రెష్ గా ఉంటుంది. సినిమా ఒక న్యూ ఏజ్ యాక్షన్ ఫిలిం లా ఉంటుంది, కానీ నా క్యారెక్టర్ మాత్రం మాస్ గా ఉంటుంది. ఇదొక యూనిక్ కాంబినేషన్. అతను ఎవరు? అతని గతం ఏంటి అనేది మోర్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

విజయాలు ఇచ్చిన ధైర్యం
తెలుగులో కొత్త కొత్త కథలను ఆదరిస్తున్నారు. మాంచి థ్రిల్లర్  సినిమాలు వస్తున్నాయి, గూఢచారి, క్షణం, ఎవరు మంచి సక్సెస్ సాధించిందాయి. డిజిటల్ మీడియా ప్రతి ఒక్కరికీ చాలా దగ్గరఅయింది. ఇలాంటి సందర్భంలో ఖైదీ లాంటి సినిమా చేసే అవకాశం ఒక్కసారే వస్తుంది. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసేటప్పుడు కూడా ఇలాంటి సినిమాలు చేయాలి అనుకున్నాను. సాంగ్స్‌, రొమాన్స్‌ లేకుండా కేవలం యాక్షన్‌ అండ్‌ థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఉండే డిఫరెంట్‌ మూవీ ఇది.

టోటల్ నైట్ షూట్
సినిమా మొత్తం 60 రాత్రులు షూట్ చేశాం. ఈ సినిమా తీసిన తర్వాత డైరెక్టర్ విజయ్ గారితో సినిమా చేస్తున్నారు. ఇప్పటివరకూ నేను చేసిన అందరూ టాలెంటెడ్ డైరెక్టర్స్. వాళ్లందరికీ మంచి మంచి అవకాశాలు వచ్చాయి.

ఆర్టీసీ సమ్మె తో కేసీఆర్ పతనం మొదలైందా?

Show comments