బాలయ్యను చెడామడా తిట్టించిన లోకేష్

తెలుగు ప్రజలకు లోకేష్ ఓ కామెడీ పీస్. ఆయన నడిచినా, మాట్లాడినా, కనీసం ట్వీటినా కూడా నెటిజన్లు చెడుగుడు ఆడేసుకుంటారు. అలాంటి లోకేష్ తన మామయ్య బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఓ కవితను వదిలారు. నటనలో సింహం, నడతలో లెజెండ్, వన్నెతగ్గని నటుడు భోళా శంకరుడు... అంటూ ఓ నాలుగు లైన్లు ధారాళంగా రాసేశారు.

ఎవరితో రాయించారో కానీ.. మొత్తానికి ఈ ట్వీట్ వైరల్ అయింది. ట్వీట్ కు కౌంటర్ గా వచ్చిన రిప్లై మెసేజ్ లు ఇంకా వైరల్ అయ్యాయి. అభిమానుల్ని కొట్టడమేనా బాలయ్య ఘనత అంటూ ఒకరు అందుకుంటే.. ప్రభుత్వం మారింది ఇక నుంచైనా జనంతో సరిగా ఉండమను, లేకపోతే తిరిగి తంతారు అంటూ మరొకరు ఆటాడుకున్నారు. తిక్కలేస్తే అల్లుడని కూడా చూడడు నిన్నుకూడా రెండు పీకుతాడు అని మరొకరు చురకలంటించారు.

ఇలా లోకేష్ ను వదలకుండా ఆడుకున్నారు నెటిజన్లు. లోకేష్ లో ఇంతటి తెలుగు భాషా ప్రావీణ్యం ఉన్నట్లు తమకు తెలియదని చెణుకులు విసిరారు. మొత్తానికి బాలయ్యని ఆకాశానికెత్తాలనుకున్నఅల్లుడి కోరిక నెరవేరకపోగా రివర్స్ లో నెటిజన్లు తిట్లదండకం అందుకున్నారు. బాలయ్యతో సహా లోకేష్ ని కూడా ఆడుకున్నారు.

ఘోర పరాభవం తర్వాత ఇంట్లో ఓదార్పు యాత్రలకి పరిమితమైపోయిన లోకష్.. ట్విట్టర్లో మాత్రం అప్పుడప్పుడూ ఇలాంటి పోస్టులు పెడుతూ మంచి కామెడీ పంచుతున్నారు. ఆయన్ని అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఇవ్వలేదు మంగళగిరి ప్రజలు. గెలిస్తే, అసెంబ్లీ సాక్షిగా ఇంకెంత కామెడీ పండించేవాడో మన చినబాబు. 

వెల్ డన్ జగన్ ..కీప్ ఇట్ అప్