ఆ ఇద్దరి కోసమేనా నెల్లూరు ఎయిర్ పోర్ట్!

ఎన్నికల కోడ్ వచ్చే ముందు హడావిడిగా చంద్రబాబు అభివృద్ధి కార్యక్రమాల పేరుతో పునాది రాళ్లు వేసుకుంటూ పోవడం కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే కాదు, అంతకు మించి ఆయా కార్యక్రమాల వెనక కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయనేది మాత్రం వాస్తవం. కడప ఉక్కుఫ్యాక్టరీ అయినా, నెల్లూరు ఎయిర్ పోర్ట్ అయినా, తాజాగా శంకుస్థాపన చేసిన ఐకానిక్ వంతెన అయినా అన్నిటి వెనకా మనీ మాఫియా ఉంది.

నెల్లూరు జిల్లాలో ఏర్పాటుచేస్తున్న ఎయిర్ పోర్ట్ కేవలం టీడీపీలో ఉన్న తమ్ముళ్ల కోసమే అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరలో ఒకరు జిల్లాలో అత్యంత కీలకమైన టీడీపీనేత కాగా, మరొకరు సీఆర్డీఏ సభ్యుడు. వీళ్లిద్దరి కోసమే ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన జరిగింది. కోట్ల రూపాయలు చేతులు మారింది.

334 కోట్ల రూపాయల వ్యయం, 1800 ఎకరాల్లో నిర్మాణం స్థూలంగా ఇదీ ఎయిర్ పోర్ట్ కి సంబంధించిన వివరాలు. ఇందులో వెయ్యి ఎకరాలకు పైగా భూమికి సంబంధించిన నష్టపరిహారాన్ని కేవలం ఇద్దరు "తెలుగు తమ్ముళ్లు" అందుకున్నారంటే తెరవెనక ఏం జరుగుతోందనే విషయాన్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు.

నెల్లూరుకు సమీపంలో రేణిగుంట దగ్గర ఎయిర్ పోర్ట్ ఉంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కోసం చెన్నైకి వెళ్లొచ్చు. ఈ రెండింటినీ కాదని ఇక్కడ 334 కోట్ల రూపాయల వ్యయంతో ఎయిర్ పోర్ట్ ప్రతిపాదన వచ్చిందంటే దానికి కారణం కేవలం ఈ "తమ్ముళ్లు". ఎయిర్ పోర్ట్ ప్రతిపాదనకు ముందే రైతుల నుంచి అత్యంత చౌకగా భూముల్ని కొనుగోలు చేసి, తర్వాత ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చిన ఘనాపాటీలు వీళ్లు.

ఈ ప్రతిపాదన సరైనది కాదు కాబట్టే వైఎస్ఆర్ హయాంలో దీనికి ఆదరణ దక్కలేదు. అయితే చంద్రబాబు తెలివిగా తన తమ్ముళ్ల కోసం ఇక్కడ ఎయిర్ పోర్ట్ కి శ్రీకారం చుట్టారు. కేవలం భూముల సేకరణలోనే వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటే ఇక ఎయిర్ పోర్ట్ వస్తుందా రాదా అనేది ఎవరికి వారు ఈజీగా ఊహించుకోవచ్చు.

శంకుస్థాపన చేసిన రోజు ఏడాదిలోగా ఎయిర్ పోర్ట్ పూర్తి కావాలని అన్నారు చంద్రబాబు. అయితే ఏడాది కాదు కదా, మరో ముప్పయ్యేళ్లు అయినా ఇక్కడ ఎయిర్ పోర్ట్ పనులు అడుగు కూడా ముందుకు పడవని స్థానిక టీడీపీ నేతలే చెబుతున్నారు.

అసలు ఎయిర్ పోర్ట్ అవసరమే లేని ప్రాంతంలో విమానాలు దించుతామంటూ చంద్రబాబు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారంటే దానికి కారణం కేవలం కొందరు 'తమ్ముళ్ల' ధన దాహం. ఇది కూడా ఎన్నికలకు సరిగ్గా 3 నెలల ముందు ప్రారంభమైందనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి.

తేలని అభ్యర్థుల ఎంపిక.. పవన్ కల్యాణ్ పనే హాయి!

NTR బయోపిక్ గురించి తెలియని విషయాలు

Show comments