నిమ్మగడ్డవి నియంత పోకడలు

ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద విమర్శల పర్వం సాగుతోంది. శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం అయితే నిమ్మగడ్డ మీద గట్టిగానే కామెంట్స్ చేశారు. నిమ్మగడ్డవి  ఏకపక్ష విధానాలు, నియంత పోకడలు అంటూ ఘాటుగానే స్పందించారు.

మీరు తప్ప ఎవరూ స్థానిక  ఎన్నికలకు నిర్వహించకూడదా, వేరే వాళ్ళు ఎస్ఈసీగా ఎన్నికలు జరిపితే నష్టమేముంది అంటూ నిలదీశారు. కరోనా సెకండ వేవ్ ఇపుడు నడుస్తోంది. వలస కార్మికులతో సహా అంతా వచ్చి ఎన్నికల్లో ఓటు వేస్తారు అపుడు కరోనా వ్యాపిస్తే బాధ్యులు ఎవరు అవుతారంటూ తమ్మినేని ప్రశ్నించారు.

మీరేమో గాజు అద్దాలు బిగించుకుని మరీ మీడియా సమావేశం నిర్వహించారు, మరి జనాలకు కరోనా నుంచి రక్షణ అక్కరలేదా అని కూడా అంటూ  నిమ్మగడ్డ మీదకు లాజిక్ పాయింటే  వదిలారు.

ఎవరూ వద్దన్న ఎన్నికలు నిర్వహించాలన్న ఆరాటం అంతగా ఎందుకు పడుతున్నారో చెప్పాలని కూడా తమ్మినేని సీతారాం అడిగారు. కచ్చితంగా కొందరి ప్రయోజనం కోసం నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయం ఎందరికో ప్రమాదం అన్న సంగతి తెలియదా అని తమ్మినేని హాట్ కామెంట్స్ చేశారు. 

ఆఖరుకు ఐఏఎస్ లను కూడా బెదిరించే స్థాయిలో నిమ్మగడ్డ ఉన్నారని, ఇది దారుణమని తమ్మినేని అంటున్నారు. ఎన్నికలు వద్దు అని రేపటి రోజున ప్రజలు తిరగబడితే నిమ్మగడ్డ ఏం చేస్తారని కూడా తమ్మినేని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి నిమ్మగడ్డ  వ్యవహార శైలి మీద స్పీకర్ గుస్సా అయ్యారు.

ఏపీలో ఈడబ్ల్యూఎస్ కోటా అమలయ్యేనా?

క‌థ మొత్తం బంగారం చూట్టే

Show comments