నాట్యం...పక్కా సీరియస్ వ్యవహారం

బాగా డబ్బులు వుండి, సినిమా మీద జస్ట్ సరదా వుండి చాలా మంది ఇండస్ట్రీలోకి వస్తారు.వీళ్లలో తొంభై శాతం మందిని సింపుల్ గా తీసి పక్కన పెట్టేయచ్చు. డబ్బు, కోరిక తప్ప కృషి లేదు అని అర్థం అయిపోతుంది. 

కానీ పెద్దింటి కోడలిగా, పెద్దింటి అమ్మాయి గా సంధ్య రాజు 'నాట్యం' అనే సినిమాతో హీరోయిన్ గా, నిర్మాతగా ఇండస్ట్రీలోకి వస్తున్నారు. ఈ సినిమా వచ్చేవారం విడుదల కాబోతుండగా, ఈవారం ట్రయిలర్ వచ్చేసింది. ట్రయిలర్ చూసిన తరువాత ఇది పక్కా సీరియస్ వ్యవహారం అని అర్థం అయిపోతోంది.

కేవలం నాట్యం వచ్చు కనుక, కాస్త డబ్బులు వున్నాయి కనుక సినిమా తీసేయలేదు...ఆమె దగ్గర విషయం వుంది అని అయిపోతోంది ట్రయిలర్ చూస్తుంటే. నాట్యం బ్యాక్ డ్రాప్ లో ఓ ఇంట్రస్టింగ్ కథను అల్లుకున్నట్లు కనిపిస్తోంది. 

ఇటు ఊరి సెంటిమెంట్, అటు ప్రేమ, మరోపక్క నాట్యంపై మమకారం ఇలా అన్నింటినీ కలుపుతూ, మరో ఇంట్రస్టింగ్ పాయింట్ ను కనెక్ట్ చేస్తూ కథ అల్లినట్లు అర్థం అవుతోంది.

ట్రయిలర్ క్వాలిటీగా వుంది. ఇటు మేకింగ్ పరంగా, అటు నటీనటుల పరంగా.  బ్యాక్ గ్రవుండ్ స్కోర్ బాగుంది. చిత్రీకరణ రిచ్ గా వుంది. మొత్తానికి ఓ ఇంట్రస్టింగ్ సినిమానే సంధ్య రాజు అటు హీరోయిన్ గా, ఇటు నిర్మాతగా ఎంచుకుని ముందుకు సాగుతున్నట్లు అర్థం అవుతోంది.

Show comments