నాని స్వంత సినిమా హిట్

హీరో నాని ఇప్పటికే ఓసారి నిర్మాతగా మారి 'అ' అనే సినిమా నిర్మించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి మంచి సినిమా వుంటే ఏదో విధంగా పాలు పుంచుకుని ఎంకరేజ్ చేయడం అన్నది నానికి మొదట నుంచి అలవాటు. తన కెరీర్ ఆరంభంలోనే డి అంటే దోపిడి అనే సినిమాను సపోర్ట్ చేసాడు.

తరువాత నిర్మాణ భాగస్వామ్యం తీసుకుని 'అ' సినిమా నిర్మించాడు. జెర్సీ సినిమాలో పారితోషికం లేకుండా లాభాల్లో వాటా తీసుకుని పనిచేసాడు. ఇప్పుడు లేటెస్ట్ సంగతేమిటంటే మళ్లీ తన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై రెండో సినిమాకు ఈరోజు శ్రీకారం చుడుతున్నాడు. ఆ సినిమా టైటిల్ నే హిట్. 

ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్ వంటి సినమాలో వైవిధ్యమైన నటుడిగా పేరు తెచ్చుకున్న విష్వక్ సేన్ హీరోగా సినిమా నిర్మిస్తున్నాడు. కొత్త డైరక్టర్ ఈ సినిమాకు పనిచేస్తాడు. మొత్తానికి నాని తన థింకింగ్ అంతా వేరు అని మరోసారి ప్రూవ్ చేసుకుంటున్నాడు.

'మా' రచ్చ మాములూగా లేదుగా.. మొత్తం తిట్లే

Show comments

Related Stories :