నాని ఓకె..మరో హీరో ఎవరో?

సమ్మోహనం సినిమా తరువాత దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ నిర్మాత దిల్ రాజు దగ్గర లాక్ అయ్యారు. ఆయనకు చేయాల్సిన సినిమాకు సంబంధించి కథను లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఇంద్రగంటి-దిల్ రాజు కాంబినేషన్ సినిమాలో ఇద్దరు హీరోలు వుంటారని ఇప్పటికే వార్తలు వచ్చేసాయి. 

ఈ ఇద్దరు హీరోల్లో ఒకరిగా నటించడానికి నాని ఓకె చెప్పేసాడట. అయితే ఇప్పుడు సమస్య ఏమిటంటే, నానితో పాటు ఈ మల్టీ స్టారర్ లో చేయబోయే మరో హీరో ఎవరు అన్నదే. ఇదే ఇంకా ఫిక్స్ కాలేదు. నానితో పాటు సెట్ అయ్యే హీరో కావాలి. అందుకే ఇప్పుడు డిస్కషన్లు, వెదుకులాట నడుస్తోంది.

రెండో హీరో సెట్ అయితే సినిమాను మరి కాస్త ముందుకు తీసుకెళ్లే పనిలో వున్నారట. ప్రస్తుతం జెర్సీ సినిమా మీద వున్న నాని, అవసరం అయితే సమాంతరంగా చేయడానికి కూడా సిద్దమే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఇదంతా రెండో హీరో ఫిక్స్ అయిన తరువాతే. 

ప్రస్తుతం ఎఫ్ 2, మహర్షి నిర్మాణాలు, వినయ విధేయ, రోబో 2.0 తదితర సినిమాల విడుదల హడావుడి లో వున్న దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ట్ మీదకు వస్తే, రెండో పేరు బయటకు వస్తుందేమో?

Show comments