నాని కోసం ఓల్డ్ కలకత్తా సెట్

ప్రేక్షకులకు కాస్త వైవిధ్యమైన కథలు చెప్పాలంటే ఆ కథలో ఏదో మ్యాజిక్ వుండాల్సిందే. అందుకే మన కథకులు, దర్శకులు కొత్తగా ఆలోచిస్తూనే, వెనకటి సంగతులు కూడా తెరపైకి తీసుకువస్తుంటారు. రంగస్థలం, రణంరంగం సినిమాల్లో పాత తరాన్ని టచ్ చేసిన సంగతి తెలిసిందే.  హీరో ప్రభాస్ రాథేశ్వామ్ సినిమాలో పాతకాలం నాటి ఇటలీని చూపించబోతున్న సంగతి తెలిసిందే.

అలాగే రాబోయే శ్యామ్ సింఘ రాయ్ సినిమాలో పాతకాలం కలకత్తాను చూపించబోతున్నారు. ఈ సినిమా కథే కాస్త ఫాంటసీ మిక్స్ అయిన ఫిక్షన్ గా వుంటుందని తెలుస్తోంది. అందులో భాగంగా పాత కలకత్తా లుక్ కావాల్సి వుంది. ఈ మేరకు హైదరాబాద్ లోనే సెట్ వేయబోతున్నారు.  కలకత్తా వెళ్లినా పాత లుక్ వుండదు. అందుకే ఇక్కడే పాతతరం కలకత్తా లుక్ ను సెట్ వేసి ఆవిష్కరించబోతున్నారు.

ప్రస్తుతం టక్ జగదీష్ సినిమా చేస్తున్నారు నాని. ఈ సినిమా పూర్తయిన తరువాత శ్యామ్ సింఘ రాయ్ ప్రారంభమయ్యే అవకాశం వుంది. 

దేవుడి ఆస్తులను కాజేసింది చంద్రబాబు

Show comments