నకిలీ ఓట్లే.. ఫలితాలు మార్చేస్తాయా?

ఏపీ రాజకీయంలో ఇప్పుడు ఓట్ల పందేరం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ఓట్ల తొలగింపు ఆరోపణలు గట్టిగా వస్తున్నాయి. తమకు జనాలు ఓటేసేలా చూసుకోవడం మాట ఎలాఉన్నా.. తమకు పడదు అనే ఓటును జాబితా నుంచి తొలగింపజేయడానికే చంద్రబాబు నాయుడు పార్టీ ప్రాధాన్యతను ఇస్తోందనే మాట వినిపిస్తోంది. ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీ నుంచి తీవ్రమైన ఆందోళన వ్యక్తం అవుతోంది.

తమకు పడవు అనే ఓట్లను తొలగింపజేయడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారని.. ముందుగా సర్వే బృందాలను వీధుల్లోకి పంపుతున్నారని.. వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారనే ప్రశ్నతో వారు ఇచ్చే సమాధానాన్ని బట్టి ఓటు ఉంచడమా తొలగించడమా అనే అంశాన్ని తేలుస్తారని సమాచారం. ఆపై ఎలాగూ బూత్‌స్థాయి కార్యకర్తలకు క్లారిటీ ఉంటుంది.

ఎవరు ఏ పార్టీ అనే అంశంపై వారికి స్పష్టత ఉంటుంది. తమకు కాని వారి ఓట్లను అలా బూత్‌ లెవల్లోనే తొలగింపజేస్తున్నారని సమాచారం. అలాగే టెలిఫోనిక్‌ సర్వేలు.. అంటే చంద్రబాబు నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ కాల్‌కు నెగిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చే ఓటర్లను కూడా జాబితా నుంచి తొలగిస్తున్నారని సమాచారం.

ఇలా తమకు పడవు అని ఫిక్స్‌ అయిన ఓట్లను తొలగించడం ఒక సంగతి అయితే.. నకిలీ ఓట్ల చేర్పులు మరో సంగతి. గ్రామీణ, సెమీ అర్బన్‌ ఏరియాస్‌లో ఈ తీరు ఎక్కువగా కనిపిస్తోంది. నకిలీ అడ్రస్‌లతో ఒక్కోరికి నాలుగైదు ఓట్లను రిజిస్టర్‌ చేయిస్తున్నారని సమాచారం. వేర్వేరు బూత్‌ల పరిధిలో ఓట్‌ హక్కు కోసం అప్లైచేసి, తమ కార్యకర్తలకు నాలుగైదు ఓట్లు ఉండేలా చూసుకుంటున్నారని సమాచారం.

గ్రామీణ రాయలసీమ ప్రాంతంలో బూత్‌ లెవల్లో ఒక్కోరు రెండు మూడు ఓట్లు వేసినా అడిగేనాథుడు ఉండడు. తమకు అనుకూలమైన గ్రామాల్లో అధికార పార్టీ ఈ వ్యవహారాలను ముమ్మరం చేసిందని సమాచారం. అక్కడ ప్రత్యర్థి పార్టీకి ఏజెంట్లు కూడా సరిగా కూర్చునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఎన్ని ఓట్లు అయినా వేసుకోవచ్చు.

అందుకే జాబితాలో పేర్లను చేర్పిస్తున్నారనే టాక్‌ వినిపిస్తోంది. ఈ విషయంలో ఈసీకి ఫిర్యాదులు కూడా అందాయి. అయితే ఏం చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. వెనుకటికి జగన్‌ కొత్తగా పార్టీ పెట్టినప్పుడు కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వం ఇలాంటి పనేచేసింది.

ఉప ఎన్నికల సమయంలో కులాల వారీగా వైసీపీకి పడతాయనే ఓట్లను భారీగా రద్దుచేశారు. అయితే అప్పట్లో అలాంటి ఎత్తుగడలను ఫలితాన్ని మార్చలేకపోయాయి. ఇక ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి!

మీటూ... సంచలనంగా మొదలైందో.. అంతే చప్పున చల్లారిందా?.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments