రిటర్న్ గిఫ్ట్ పై నాగబాబు రియాక్షన్

మా అసోసియేషన్ ఎన్నికల్లో తనను ఓడించిన నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతానని ప్రకటించిన శివాజీ రాజా, చెప్పినట్టుగానే మొన్న ఎన్నికల్లో నాగబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. దీనిపై నాగబాబు స్పందించాడు. శివాజీరాజాపై తనకు ఎలాంటి కోపం లేదని తెలిపిన నాగబాబు, కేవలం నరేష్ అంటే అభిమానంతోనే అతడికి మద్దతిచ్చానని అన్నారు.

"నరేష్ కు కూడా అవకాశం ఇవ్వాలనిపించింది. నిజానికి వ్యక్తిగతంగా నాకు నరేష్ కంటే శివాజీరాజానే ఎక్కువ. కానీ శివాజీరాజా ఆల్రెడీ ఒకసారి అధ్యక్షుడిగా చేశాడు. నరేష్ చాలా పెద్దనటుడు, ఎక్స్-హీరో, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇలాంటి వ్యక్తికి అవకాశం ఇవ్వాలనిపించింది. అందుకే మద్దతిచ్చాను."

జీవితంలో ఇది చాలా చిన్న విషయమని ఇలాంటి చిన్న ఘటనలకే శివాజీరాజా తనపై లేనిపోని ఆరోపణలు చేయడం బాగాలేదన్నారు నాగబాబు. మరోవైపు తన మద్దతుతో గెలిచిన రాజశేఖర్-జీవిత వైసీపీలో చేరడంపై కూడా స్పందించారు నాగబాబు.

"శివాజీరాజా నా మీద కోపంతో వైసీపీలో చేరాడంటున్నారు చాలామంది. ఇక నరేష్ ప్యానెల్ కు నేను సపోర్ట్ చేస్తే, నా మద్దతుతో గెలిచిన రాజశేఖర్-జీవిత కూడా వెళ్లి వైసీపీలో చేరారు. ఈ రెండు తలుచుకుంటే నాకు నవ్వొచ్చింది. నా జీవితంలో ఇది చాలా విచిత్రమైన ఘటన. దీనిపై రియాక్ట్ అవ్వడానికేం లేదు. ఇదో విచిత్ర ఘటన అనుకొని వదిలేశాను."

తను చేస్తున్న జబర్దస్త్ షోపై కూడా క్లారిటీ ఇచ్చారు నాగబాబు. ఎన్నికల్లో గెలిచినా, ఓడినా జబర్దస్త్ మాత్రం కంటిన్యూ అవుతుందన్నారు. నెలకు 4-5 రోజులు టైమ్ కేటాయిస్తే ఆ కార్యక్రమం అయిపోతుందని, దాని వల్ల తన రాజకీయ జీవితానికి ఎలాంటి అడ్డంకి ఉండదన్నారు. పైగా ప్రజల్ని నవ్వించడంలో తను కూడా భాగం అవుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు నాగబాబు.

జనసేనకు పడ్డ ఓట్లలో 80 టీడీపీ, 20 వైసీపీ ఓట్లని అంచనా!

Show comments