నాగబాబుకు కష్టకాలం?

కందకు లేని దురద కత్తిపీటకు అనే సామెతకు ఉదాహరణ చూపించమంటే పెద్దగా కష్టపడక్కరలేదు. మెగా బ్రదర్ నాగబాబు వ్యవహారాన్ని చూపించేస్తే చాలు. ప్రజారాజ్యం పెట్టి, హడావుడి చేసి, కాంగ్రెస్ లో కలిపేసి, బార్టర్ సిస్టమ్ మాదిరిగా మంత్రిపదవి తీసుకుని, అయిదేళ్లు అయిన తరువాత రాజకీయాల నుంచి దాదాపు విరమించుకున్న బ్రదర్ చిరంజీవి మౌనంగా వున్నారు.

తనవంతు ప్రయత్నం చేస్తా అంటూ జనసేన పార్టీ పెట్టి, నాలుగేళ్లు చంద్రబాబు, లోకేష్ లతో అంటకాగి, ఆఖరికి బయటకు వచ్చి, వాళ్ల మీద అవినీతి ఆరోపణలు చేసి, ఇప్పుడు వున్నట్లుండి సైలంట్ అయిపోయారు మరో బ్రదర్ పవన్ కళ్యాణ్. ఆయనకు తెలుగుదేశం పార్టీకి ఒప్పందం కుదిరిపోయిందని, అందుకే సైలంట్ అయిపోయారని బలంగా వినిపిస్తోంది.

ఇలాంటి టైమ్ లో ఆ ఇద్దరు బ్రదర్స్ కు లేని బాధ నాగబాబుకు పట్టుకుంది. తనదగ్గర వున్న జబర్దస్త్ బ్యాచ్ తో ఏవో తనకు తోచిన స్కిట్ లు చేస్తున్నారు. ఆయనకు ఆయనే ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఒకటే అనుమానం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్లి, తేదేపాతో కలిస్తే, నాగబాబు పరిస్థితి ఏమిటి? ఆయన ఇన్నాళ్లు పెట్టిన వీడియాల సంగతేమిటి?

ఈసారి పవన్ కళ్యాణ్ పై వీడియోలు పెట్టలేరు కదా? లేదా కేవలం జగన్ ను టార్గెట్ చేస్తూ కూర్చోవాలి. ఇన్నాళ్లు తెలుగుదేశం పార్టీ, బాబు, లోకేష్ ల మీద ఆయన చేసిన కామెంట్లు అన్నీ జనం కన్వీనియెంట్ గా మరిచిపోవాలి. ఏమైనా పవన్ కళ్యాణ్ మనసులో మాట తెలుసుకోకుండా నాగబాబు పాపం తొందరపడ్డారేమో.

రాయలసీమ రైతుల పుండుపై కారం