నాగార్జున రీఎంట్రీ.. వస్తూనే క్లాస్ పీకాడు

ఇది బిగ్ బాస్ సీజన్-3కి చెందిన మేటర్. ఈ సీజన్ నుంచి వారం రోజుల పాటు దూరంగా జరిగాడు నాగార్జున. తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులందరితో కలిసి స్పెయిన్ వెళ్లాడు. అలా ఫుల్ గా ఎంజాయ్ చేసిన నాగ్, ఇప్పుడు మళ్లీ బిగ్ బాస్ సెట్స్ పైకి వచ్చేశాడు. వస్తూనే సభ్యుల్లో కొందరికి క్లాస్ పీకాడు. తను స్పెయిన్ లో ఉన్నప్పటికీ.. బిగ్ బాగ్ కార్యక్రమాన్ని నాగార్జున ఫాలో అయ్యాడనే విషయం నిన్న అతడి మాటల్లోనే అర్థమైంది.

గత సీజన్లకు భిన్నంగా ఈసారి బిగ్ బాస్ హౌజ్ ఎవరిగోల వారిదే అన్నట్టుగా మారుతోంది. ఏ ఇద్దరూ కలిసి ఉండడం లేదు. ఉన్నంతలో పునర్నవి, రాహుల్ కాస్త క్లోజ్ గా ఉన్నట్టు కనిపిస్తున్నారు. వీళ్లు కూడా ఎప్పుడు మారిపోతారో ఎవరికీ అంతుచిక్కకుండా ఉంది. ఈ సంగతి పక్కనపెడితే, నాగార్జున రీఎంట్రీతో ఈసారి ఎలిమేషన్ పై మరోసారి అందరి దృష్టి పడింది. ఈ వారం హౌజ్ నుంచి ఎవరు బయటకు వెళ్లిపోతారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఐదుగుర్ని పెట్టారు. రాహుల్, శ్రీముఖి, మహేష్, రవికృష్ణ, అలీ రెజాను ఎలిమినేషన్ రౌండ్ లో పెట్టారు. వీళ్లలో ఒక్కర్ని నాగార్జున సేవ్ చేశాడు. ఎపిసోడ్ క్లోజింగ్ టైమ్ కు రాహుల్ ను నాగార్జున సేవ్ చేశాడు. రాహుల్ బయటపడ్డంతో ఇక మిగిలిన నలుగురిపై అందరి దృష్టిపడింది. అయితే ఈ నలుగురి నుంచి అలీ రెజా బయటకు వెళ్లడం ఖాయమంటోంది సోషల్ మీడియా.

బిగ్ బాస్ ఎలిమినేషన్స్ పై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో లీకులు వస్తూనే ఉన్నాయి. ఎప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం ఒక రోజు ముందే బయటకు వచ్చేస్తోంది. ఇప్పటివరకు వచ్చిన లీకులన్నీ నిజమయ్యాయి. నిన్నట్నుంచి అలీ రెజా పేరు గట్టిగా వినిపిస్తోంది. కాబట్టి ఈసారి ఇతడు బయటకు వెళ్లిపోవచ్చని అంతా భావిస్తున్నారు. హౌజ్ లో అలీ రెజా కొనసాగుతాడా లేక బయటకు వెళ్లిపోతాడా అనే విషయం మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.

Related Stories: