నా బాడీ లాంగ్వేజ్ చాలా హాట్

సాధారణ అమ్మాయిలా తను కూర్చోలేనని, తన బాడీ లాంగ్వేజ్ నార్మల్ గా ఉండదని అంటోంది హీరోయిన్ అను ఎమ్మాన్యుయేల్. అమెరికాలో పుట్టి, పెరగడం వల్ల తన తీరు చాలా హాట్ గా ఉంటుందని చెప్పుకొస్తోంది. ఇండియన్ వంటకాలు ఇష్టపడే అను.. బిహేవియర్ లో మాత్రం అమెరికన్ లా ఉండాలని అనుకుంటోంది.

"చీరలు కట్టుకుంటాను. చర్చికి వెళ్తాను. అంతవరకే. కానీ నా బాడీలాంగ్వేజ్ చాలా డిఫరెంట్. భారతీయ అమ్మాయిలు కూర్చునే విధానం, నడక తీరుకు పూర్తి భిన్నంగా నా బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కాస్త హాట్ గా టిపికల్ గా ఉంటుంది. కానీ ఇప్పుడిప్పుడే ఒద్దికగా కూర్చోవడం లాంటివి నేర్చుకుంటున్నాను."
 
బాడీ లాంగ్వేజ్ హాట్ గా ఉన్నప్పటికీ.. మాటతీరు మాత్రం అలా ఉండదంటోంది ఈ బ్యూటీ. నిజానికి తను పెద్దగా మాట్లాడనని, కానీ ఒక్కసారి స్టార్ట్ చేస్తే మాత్రం మాటలు ఆపనని చెబుతోంది. "రియల్ లైఫ్ లో నేను చాలా సైలెంట్. చెప్పేది ఎక్కువగా వినడానికే ఇంట్రెస్ట్ చూపిస్తా. కానీ ఒక్కసారి మాట్లాడ్డం స్టార్ట్ చేస్తే మాత్రం ఆపను. నా మాటతీరుతో ఒక్కోసారి నాకు నేనే ఆశ్చర్యపోతుంటాను."

శైలజారెడ్డి అల్లుడు సినిమాలో మాత్రం తను పూర్తి భిన్నంగా కనిపిస్తానని అంటోంది అను. మూవీలో చాలా సన్నివేశాల్లో అరవాల్సి వచ్చిందని. గట్టిగా అరిచి మాట్లాడానని అంటోంది. తెలుగు సినిమాలతో బిజీ అయిన తను అమెరికాకు వెళ్లడం తగ్గించానని, ఇంకాస్త డబ్బులు సమకూరితే హైదరాబాద్ లోనే ఇల్లు కొనుక్కుంటానని అంటోంది అను ఎమ్మాన్యుయేల్.

RELATED నోటా డబ్బింగ్ స్టార్ట్స్ నౌ?