ఎంపీ సీట్లు-ఎవరు బెటర్

కులాల వారీ జనాలను ఆదుకోవడంలో, పెద్దపీట వేయడంలో చంద్రబాబును మించిన వారు లేరని ఆ పార్టీ కరపత్రికలు టముకేస్తుంటాయి. పైగా జగన్ ఇలా టికెట్ లు ఇచ్చారో లేదో, ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచే వెబ్ సైట్లు, మీడియా, రెడ్లకు పెద్ద పీట వేసారు అంటూ నానా హంగామా చేసారు. కానీ వాస్తవాలు వేరుగా వున్నాయి.

ఎంపీ సీట్ల వరకు తెలుగుదేశం-వైకాపా సీట్ల కేటాయింపు ఓసారి పరిశీలిస్తే..

రెడ్లు.............. 4(తేదేపా)............6 (వైకాపా)
కమ్మ..........,,...6(తేదేపా)............3 (వైకాపా)
కాపు.........,,,.....2(తేదేపా)............3 (వైకాపా)
వెలమ.............0(తేదేపా)............1 (వైకాపా)
బిసి.................5(తేదేపా)............6 (వైకాపా)
ఎస్..ఎస్టీ..........5(తేదేపా)............5 (వైకాపా)
క్షత్రియ...........2(తేదేపా)............1 (వైకాపా)
వైశ్య.................1(తేదేపా)............0 (వైకాపా)

తెలుగుదేశం కమ్మవారికి వైకాపాలో రెడ్లకు కాస్త పెద్ద పీట అన్నది కామన్. అయితే తెలుగుదేశం అనుకూల మీడియా ఈ రెడ్లను చూపిస్తుంది కానీ, కమ్మవారి సంగతి చెప్పదు. ఆ సంగతి వదిలేస్తే కాపులకు, వెలమలకు, బిసిలకు వైకాపానే పెద్ద పీట వేసిన సంగతి క్లియర్ గా తెలుస్తోంది. ఒక్క వైశ్య అభ్యర్థి మాత్రమే వైకాపాకు దొరకలేదు. లేదూ అంటే నూటికి నూరుశాతం కులాల తూకంలో వైకాపాదే పైచేయి అయ్యేది.

చంద్రబాబు నిర్ణయాల పలితం-శక్తిమంతంగా KCR 

యాత్ర సినిమా సగటు విజయం ఏం చెప్తోంది?

Show comments