మూలుగుతున్న టీడీపీపై తాటిపండ్లు!

అసలే తీవ్ర స్థాయిలో ఉన్న  ప్రజా వ్యతిరేకత.. మరోవైపు రాజీనామాలు.. టికెట్ ఖరారు చేసిన వారు కూడా ‘వద్దు బాబోయ్..’ అన్నట్టుగా రాజీనామా చేసి వెళ్లిపోతున్న పరిస్థితి! ఐదేళ్ల పాటు జగన్ పార్టీ నుంచి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను తెచ్చుకుంటే, మరో ముగ్గురు ఎంపీలనూ దారి మళ్లించుకుంటే… ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి!

ఒకటి కాదు రెండుకాదు.. అరడజను ఎంపీ సీట్ల విషయంలో చంద్రబాబు నాయుడు వారం నుంచి కసరత్తు చేస్తూ ఉంటే.. అభ్యర్థులు సెట్ కావడం లేదు. కొన్ని సీట్లకు ఎవరిని నిలపాలా.. అని చంద్రబాబు నాయుడు తంటాలు పడుతూ ఉన్నారు. మరికొన్ని సీట్ల విషయంలో పోటీచేయడానికి కొంతమంది రెడీ అంటున్నావారి మీద చంద్రబాబుకే నమ్మకం కలగడం లేదు. ఇదీ పరిస్థితి.

ఇలా మూలుగుతున్న టీడీపీపై రాజీనామాలు అనే తాటిపండ్లు పడుతూ ఉన్నాయి. ఒకవైపు మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా చేశారు. ఆయనకు కోరిన టికెట్ ఇవ్వడానికి బాబు రెడీ అయినా.. ఆయన మాత్రం ఇప్పుడు  రాజీనామాకే మొగ్గు చూపారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి రంగం సిద్ధం అయ్యింది!

ఆయన మాత్రమే కాదట.. రాయపాటి కూడా రాజీనామాకు రెడీ అయ్యారట. ఇక గంటా విషయంలో టీడీపీ ఎంత కవరేజీ వర్క్ చేసుకున్నా.. ఇంకా అపనమ్మకంగానే ఉంది వ్యవహారం. ఇక రాజీనామా జాబితాలో.. ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని స్పష్టం అవుతోంది. 

తెలుగుదేశం పార్టీ తొలిజాబితా రావడమే ఆలస్యం..మరిన్ని వికెట్లు టపాటపా పడిపోవడం ఖాయమని స్పష్టం అవుతోంది. అందుకే దాన్ని వాయిదా వేసుకొంటూ పోతున్నారు. ఈరోజు తొలిజాబితా అని ప్రకటించారు. అయితే.. అదేం జరగలేదు.

బహుశా ఏ అర్ధరాత్రో విడుదల అయితే చెప్పలేం. అది విడుదల కావడం ఆలస్యం.. చాలామంది రాజీనామాల వార్తలు రాసుకోవడానికి కూడా రెడీగా ఉండాలని.. సదరు నేతలు మీడియాకు సమాచారం ఇస్తూ ఉన్నారు.

మీ ఓటు ఉందో లేదో.. ఇలా నిర్ధారించుకోండి!

అనంత వైసీపీలో అప్పుడే మంత్రి పదవుల లొల్లి!