అన్నిటికంటే ఆర్.ఆర్.ఆర్.కే ఎక్కువ నష్టం

ఎన్టీఆర్‌చరణ్ కలిసి రాజమౌళి డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నారంటే ఫాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఏడాది జులై రిలీజ్ అనుకున్నది వచ్చే ఏడాది జనవరికి వాయిదా పడింది. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రం చేసే సంచలనం అలా ఇలా వుండదంటూ ఎదురు చూస్తుండగా కరోనా రాకాసి వచ్చిపడింది. దీంతో వచ్చే సంక్రాంతికి రిలీజ్ అవడం దాదాపు అసాధ్యమని తేలిపోయింది.

వచ్చే వేసవికి అయినా ‘ఆర్.ఆర్.ఆర్.’ రిలీజ్ వుంటుందా? ఇప్పట్లో ఈ చిత్రం షూటింగ్ మళ్లీ మొదలవుతుందా? అంటూ చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

తెలుగు సినిమాకి సంబంధించి సెట్స్‌పై వున్న అతి భారీ చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్.’ ప్రభాస్ సినిమాతో పాటు చిరంజీవి ఆచార్య కూడా నిర్మాణ దశలోనే వున్నాయి. వాటితో పోలిస్తే ఎక్కువ నష్టం వాటిల్లేది మాత్రం ‘ఆర్.ఆర్.ఆర్.’కే.

ఇప్పటికే ఈ చిత్ర నిర్మాణంపై భారీగా ఖర్చు చేసేసారు. రాజమౌళి మాటలలోనే చెప్పాలంటే ఎనభై శాతం షూటింగ్ కూడా పూర్తయిపోయింది. ఇక ఇప్పటి పరిస్థితులని బట్టి ఇదివరకు ఆఫర్ చేసిన రేట్లు ఇవ్వడానికి బయ్యర్లు వెనకాడుతున్నారు కనుక బడ్జెట్ రీ అడ్జస్ట్‌మెంట్స్ కూడా ఈ దశలో అంత తేలిక కాదు. 

Readmore!

ప్రస్తుతానికి ఇదంతా ఆలోచించుకోవడం, తర్జనభర్జనలు పడడం తలనొప్పి వ్యవహారం కనుక అందరిలానే రాజమౌళి బృందం కూడా ఈ విపత్తు దాటిపోయేవరకు వేచి చూస్తున్నారు.

ఇన్ని వేషాలు అవసరమా నిమ్మగడ్డా

Show comments